కామిడీగా రాజశేఖర్ ....

By Staff

Rajasekhar
అవును...రాజశేఖర్ ఇప్పుడో కామిడీ సినిమాకు సైన్ చేసాడు. అందరూ కామిడీతో ముందుకెళుతూంటే తను మాత్రం అవుట్ డేట్ అయి పోయిన యాక్షన్ సినిమాలనే ఎందుకు నమ్ముకోవాలి అనుకున్నాడో యేమో ఆయనా ఈ బాట పట్టాడు. కాకపోతే తన మార్కు అయిన రీమేక్ నే నమ్ముకున్నాడు. మళయాళంలో మోహన్ లాల్ నటించిన 'హలో' సినిమాను తెలుగుకి రీమేక్ చేయటానికి ఒప్పుకున్నాడు. 'చిరునవ్వుతో' దర్శకుడు రామ్ ప్రసాద్ డైరక్ట్ చేయనున్న ఈ సినిమా ఆద్యంతం కామిడీతో సాగుతుందిట.

ఇక ఈ ప్రాజెక్టుకు నిర్మాత గా మాగంటి గోపీనాథ్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం తన సహచరి జీవిత దర్శకత్వంలో 'ఖాఖి' రీమేక్ 'సత్యమేవ జయతే' చేస్తున్న రాజశేఖర్ ఈ సినిమా తర్వాత ఈ కొత్త చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో సుహాసి లీడింగ్ రోల్ చేస్తుంది. మొదట కాజల్ ని అడిగారట కానీ ఆమె బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారుట.

ఇక కథప్రకారం బధ్దకస్తుడైన..తాగుబోతు లాయర్ గా రాజశేఖర్ కామిడీ పండిస్తాడు. అతనికి వచ్చిన ఒక మిస్టీరియస్ కాల్ అతని జీవిత గమనాన్ని మారుస్తుంది. ఇక ఈ చిత్రానికి రమణగోగుల సంగీతం అందించటానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టులో పూజ కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. రామ్ ప్రసాద్ 'గేమ్' సినిమా తర్వాత పూర్తి ఖాళీగా ఉన్నారు. గత కొంత కాలంగా ఈ స్క్రిప్టు స్టోరీ సిట్టింగ్స్ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుంతం రాజశేఖర్ నటించిన 'గోరింటాకు' రిలీజుకు రెడీ అవుతోంది. అదీ ఒక కన్నడ రీమేక్ కావటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X