»   » షాక్: సొంత కూతురుకే విలన్ అయిన రాజశేఖర్

షాక్: సొంత కూతురుకే విలన్ అయిన రాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ రాజశేఖర్ ను మనం ఇప్పటి వరకు తెరపై కేవలం హీరోగా మాత్రమే చూసాం. త్వరలో ఆయన్ను మనం వెండి తెరపై విలన్ గా చూడబోతున్నాం. తన సొంత కూతురు హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు రాజశేఖర్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు.

రాజశేఖర్ కూతురు శివాని "వందకు వంద" మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేయాలని రాజశేఖర్ నిర్ణయించుకున్నారు. ఈ మధ్య రాజశేఖర్ కు హీరోగా అస్సలు కలిసి రావడం లేదు. దీంతో ఆయన్ను కొందరు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు తమ సినిమాల్లో విలన్ పాత్రలు చేయమని అడిగినా... ఆయన ఒప్పుకోలేదు.

 Rajasekhar Turns Villain

ఇన్నాళ్లు విలన్ పాత్రలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపని రాజశేఖర్ కూతురు సినిమా కోసం విలన్ గా మారుతున్నాడు. రాజశేఖర్ విలన్ గా నటిస్తున్న సినిమా కావడం వల్ల పబ్లిసిటీ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ ఇతర సినిమాల్లోనూ విలన్ గా చేసే అవకాశం ఉంది.

ఆ మధ్య రాజశేఖర్ చిరంజీవి సినిమాలో విలన్ గా నటించడానికి తాను సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి అవకాశం వస్తే రాజశేఖర్ ఒప్పుకుంటారో? లేదో? ఒక వేళ ఒప్పుకుంటే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్షేషన్ సృష్టించడం ఖాయం.

English summary
Hero Rajashekar is now turning into a villain for his daughter's debut.
Please Wait while comments are loading...