జీవిత ప్రశ్న: చిరుతో నటిస్తానన్న రాజశేఖర్
హైదరాబాద్: మల్టీ స్టారర్ సినిమాలో నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారని అడిగితే హీరో రాజశేఖర్ ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. అయితే, ఆ ప్రశ్న కూడా రాజశేఖర్ భార్య జీవిత ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో వేశారు. జీవిత ప్రశ్నకు ఆయన ఏ మాత్రం తడుముకోకుండా జవాబిచ్చారు.
చిరంజీవి పాత్రకు దీటుగా ఉడే పాత్ర అయితే చిరంజీవి నటించే సినిమాలో విలన్‌గా నటించడానికి తాను సిద్ధమేనని రాజశేఖర్ చెప్పారు. మీతో నటించిన హీరోయిన్లలో మీకు ఎక్కువగా ఎవరు ఇష్టమని జీవిత మరో ప్రశ్న వేశారు. దానికి రాజశేఖర్ కొంటెగా సమాధానమిచ్చారు.

ప్రతి హీరోయిన్ కూడా నచ్చుతుందని, బయటకు చెప్పగలుగుతామా అని రాజశేఖర్ గడుసుదనం ప్రదర్శించారు. అయితే నయనతార అంటే తనకు ఇష్టమని చెప్పారు. జీవిత పక్కన ప్రభు దేవా కూడా ఉన్నాడు.
భార్యగా, దర్శకురాలిగా జీవితకు వంద మార్కులు వేస్తానని రాజశేఖర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజశేఖర్‌కు తానే ముందు ప్రపోజ్ చేశానని జీవిత చెప్పగా, తానే ముందు ప్రపోజ్ చేశానని రాజశేఖర్ చెప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











