నీతూకిచ్చిన వార్నింగ్ నిజమే: రాజశేఖర్

నాకు కడుపు మండి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. ఇలా ప్రవర్తిస్తే తెలుగులోనే కాదు...సౌత్ ఇండియాలో ఏ భాషలోనూ చేయలేవని గట్టిగా చెప్పాను.పరిస్ధితిని వివరించాను. ఆమె కూడా అర్ధం చేసుకుని వచ్చి నటించి వెళ్ళింది. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలపెట్టింది.ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం. భాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఆ మాత్రం మందలించే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. 'హిందీలో ఘనవిజయం సాధించిన ఖాకీ' చిత్రంలోని పాయింట్ ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రానికి నేను స్క్రీన్‌ప్లే చేసాను. నేను అనుకున్నది అనుకున్న విధంగా జీవిత తెరకెక్కించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా విజయం కావాలని కష్టపడ్డారు. అందరికీ పేరు, పేరు నా నాధన్యవాదాలు' అన్నారు.
అనంతరం దర్శకురాలు శ్రీమతి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ 'ఈ సినిమా ఇంత భారీగా చేయడానికి ముఖ్య కారకులు డా. దాసరి నారాయణరావు గారు. ఆయన ఈ కథ విని నేను చేస్తాను ఎంత ఖర్చయినా ఫర్వాలేదు అని ప్రోత్సహించారు. ఆయన ఆశీస్సులతోనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించగలిగాం.సినిమా ఫిబ్రవరి 6న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.


Click it and Unblock the Notifications











