ఈ కాంబో సెట్ అవుతుందా? హీరో రాజశేఖర్, వెంకటేష్ కాంబినేషన్‌లో సినిమా?

తాజాగా విక్టరీ వెంకటేష్ తేజాల కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి కీలకమైన వెంకటేష్ బావ పాత్రలో నటించేందుకు రాజశేఖర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.

Recommended Video

Venkatesh And Rajasekhar Multistarrer Movie ? ఈ కాంబో సెట్ అవుతుందా?

ఒకప్పుడు యాంగ్రీ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజశేఖర్‌కు చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. ఈ నేపథ్యంలోనే, ఇటీవల ఆయన విలన్ పాత్రలకు షిఫ్ట్ అవుతున్నాడని ప్రచారం జరిగింది. అయితే, అలాంటి వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటిదాకా విలన్‌గా ఒక్క సినిమా కూడా ఆయన ఒప్పుకోలేదు.

గరుడ వేగ

గరుడ వేగ

అయితే ఈ మధ్య వచ్చిన గరుడ వేగ మంచి విజయాన్నే అందుకున్నా పూర్తి స్థాయిలో ఆర్థికంగా రాజశేఖర్ ని ఆదుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. ఆయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే చాలా విషయాలు చెప్పాడు ఈ యాంగ్రీ యంగ్ మాన్. వాటిలో ఇప్పుడు ఒక కోరిక తీరుతున్నట్టే ఉంది....

బాలకృష్ణ 102వ సినిమాలో

బాలకృష్ణ 102వ సినిమాలో

బాలకృష్ణ 102వ సినిమాలో విలన్‌గా నటించమని తనను అప్రోచ్ అయ్యారని, అయితే తన పాత్ర రొటీన్‌గా ఉండటంతో తాను ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. నటనకు స్కోప్ ఉన్న మంచి విలన్ రోల్స్ వస్తే నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ కోరిక నెరవేరే చాన్స్ వచ్చినట్టే ఉంది...

వెంకటేష్ తేజా కాంబినేషన్

వెంకటేష్ తేజా కాంబినేషన్

ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు గానీ... వెంకటేష్ తేజా కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో విలన్‌గా చేయోబోతున్న రాజశేఖర్ అంటూ ఒక మాట వినిపిస్తోంది టాలీవుడ్‌లో. బాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ లలో స్టార్ హీరోలు మల్టీ స్టారర్లు చేసే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

అయితే టాలీవుడ్ మాత్రం ఈ విషయంలో కొద్దిగా వెనుకబడే ఉందని చెప్పవచ్చు. అడపాదడపా ఎవరన్నా చిన్న హీరోలు మల్టీ స్టారర్లతో అలరించడం తప్ప స్టార్ హీరోలు డేర్ చేసిన దాఖలాలు లేవు. అయితే విక్టరీ వెంకటేష్ - ప్రిన్స్ మహేష్ బాబు ఆ ట్రెండ్ కు బ్రేక్ వేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో వారిద్దరూ ఓ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.

 మరోసారి వెంకీ మల్టీ స్టారర్

మరోసారి వెంకీ మల్టీ స్టారర్

ఆ తర్వాత టాలీవుడ్ లో ఆ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా మరోసారి వెంకీ ఓ మల్టీ స్టారర్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. తేజ దర్శకత్వంలో వెంకీ నటించనున్న చిత్రంలో ఓ సీనియర్ హీరో నటించబోతున్నట్లు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.

 యాంగ్రీ యంగ్ మ్యాన్

యాంగ్రీ యంగ్ మ్యాన్

"నేనే రాజు నేనే మంత్రి" సినిమా కోసం ముందుగా "యాంగ్రీ యంగ్ మ్యాన్" రాజశేఖర్ ను సంప్రదించానని తేజ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్ర క్లైమాక్స్ విషయంలో వారిద్దరికీ అభిప్రాయభేదాలు రావడంతో రాజశేఖర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ అవకాశాన్ని అందుకున్న రానా - తేజలు హిట్ ను అందుకున్నారు.

వెంకీతో మరో సినిమా

వెంకీతో మరో సినిమా

అదే ఊపులో వెంకీతో మరో సినిమా చేసేందుకు తేజ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం మాధవన్ - నారా రోహిత్ - సుమంత్ ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆ చిత్రానికి కీలకమైన వెంకటేష్ బావ పాత్రలో నటించేందుకు రాజశేఖర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.

గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా?

గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా?

అయితే `గరుడవేగ`తో మంచి హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజశేఖర్ ఇకపై నటించబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ - తేజ ల ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ రాజశేఖర్ అంగీకరిస్తే...వెండితెరపై తొలిసారిగా వెంకీ - రాజశేఖర్ ల కాంబో ఆసక్తికరంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సారైనా తేజకు రాజశేఖర్ ఓకే చెబుతాడో? లేదో? వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X