భక్త కన్నప్పగా రాజశేఖర్!
హీరో రాజశేఖర్ దృష్టి భక్తి కథా చిత్రాల వైపు మళ్ళింది. పౌరాణిక, చారిత్రక కథా చిత్రాలు కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా రావడం మామూలే. రాజశేఖర్ వచ్చే ఏడాది భక్త కన్నప్ప చిత్రాన్ని, నిర్మించి అందులో నటించనున్నారు. ఆయన ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేసుకుని కథా చర్చలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం కృష్ణంరాజు భక్తకన్నప్పగా నటించారు. ఆనాడు ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. భక్తిరస చిత్రాలు తీయడంలో దిట్ట అయిన ఒక అగ్రదర్శకుడిని డైరెక్ట్ చేయవలసిందిగా రాజశేఖర్ కోరుతున్నట్టు తెలుస్తోంది. హీరోగానే గాక నిర్మాతగా కూడా వెనుకబడిన రాజశేఖర్ భగవంతుడిని నమ్ముకోవడంలో తప్పు లేదేమో.


Click it and Unblock the Notifications