ఫుల్ యాక్షన్ (మహంకాళి ప్రివ్యూ)
హైదరాబాద్ : తన భార్య దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన పూర్తి యాక్షన్ చిత్రం మహంకాళి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని నిజాయితి గల ఓ పోలీస్ అధికారి వీటికి ఎలా స్పందించారు. రాజకీయ ఒత్తిళ్లలను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశంతో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. రాజశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంకుంశం రేంజిలో పవర్ ఫుల్ గా ఉంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.
కథలో ...మహంకాళి (రాజశేఖర్) నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారి. హైదరాబాద్ నగరంలో బాంబులు పేలి చాలామంది చనిపోతారు. కొన్ని రోజుల హడావిడి అనంతరం, ఆ విషయం మరుగునపడుతుంది. ఈ సమస్యపై మహంకాళి పోరాడే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఉగ్రవాదులు భయపడేలా అతని చర్యలుంటాయి. చివరికి అతని పోరాటంలో ఏ విధంగా విజయం సాధించాడు? తనీషా (మధురిమ) అనే యువతితో ఉన్న సంబంధంఏమిటనేది తెర మీదే చూడాలి.
దర్శకురాలు జీవిత మాట్లాడుతూ ''అసలుసిసలు పోలీస్ అధికారి ఎలా ఉండాలో మహంకాళి పాత్ర చూస్తే అర్థమవుతుంది. ఉగ్రవాద సమస్యను ప్రభావశీలంగా చర్చించాం. సమకాలీన అంశాల ప్రస్తావన ఉంటుంది. ముగింపు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి''అన్నారు. నిర్మాతలలో ఒకరైన వై.సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... పేరులోనే కాదు తన వృత్తిలో కూడా ఓ పోలీసు అధికారి ఎంత పవర్ ఫుల్ గా కనిపించాడన్న అంశాన్ని 'మహంకాళి' చిత్రంలో చూడాల్సిందేనని అన్నారు.
సంస్థ: ఎస్.ఎస్.మూవీస్, అంజేరి ఆర్ట్స్
నటీనటులు: రాజశేఖర్, మధురిమ, ప్రదీప్ రావత్, జీవా, ప్రభాకర్, రఘు, కాదంబరి కిరణ్, ప్రదీప్ రావత్, చలపతిరావు, అభినయ, సత్య ప్రకాష్, అన్నపూర్ణమ్మ నళిని, వినోద్ కుమార్, సుత్తివేలు, నర్సింగ్ యాదవ్, భరత్, ప్రసన్న కుమార్, శేఖర్, భాషా, ప్రభావతి తదితరులు
మాటలు రాజశేఖర్, కృష్ణ మోహన్,
పాటలు: సుద్దాల అశోక్ తేజ, సాహిత్య సాగర్, పైడిశెట్టి రాము,
సంగీతం: చిన్నా,
ఛాయాగ్రహణం: మధు.ఎ నాయుడు,
ఫైట్స్: కనల్ కన్నన్, మార్షల్ రమణ,
కొరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్, రాక్ నాని,
సమర్పణ: వల్లభనేని అశోక్,
నిర్మాతలు: యేలూరు సురేందర్‌రెడ్డి, ఎ.పరంధామరెడ్డి, మురళీ.ఎస్.ఆర్.
స్క్రీన్ ప్లే: డా.వి.రాజశేఖర్,
దర్శకత్వం: జీవిత రాజశేఖర్.
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











