రాజశేఖర్, సముద్ర కాంబినేషన్లో మరో సినిమా

ఈ విషయమై నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...రాజశేఖర్ తో సినిమా చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో రాజశేఖర్ కథనాయకుడిగా 'సింహరాశి, ఎవడైతే నాకేంటి వంటి రెండు సూపర్ హిట్ సినిమాల్ని అందించిన సముద్ర దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ ముహూర్తం జరిపి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగులతో సినిమా మొదలు పెడతామన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..రాజశేఖర్ తో తాను గతంలో చేసిన సినిమాలు హిట్టయ్యాయి. ఈ సారి ఆయనతో కలిసి హ్యాట్రిక్ సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. రాజశేఖర్ కు జతగా ఓ ప్రముఖ కథానాయికను ఎంపిక చేస్తున్నాము. మిగిలిన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
rajashekar samudra lagadapati srinivasulu lvr productions రాజశేఖర్ వి సముద్ర లగడపాటి శ్రీనివాసరావు ఎల్ వి ఆర్ ప్రొడక్షన్స్


Click it and Unblock the Notifications