పెళ్ళికి ముందు రాజశేఖర్ ఓ అమ్మాయితో...
అందరిలాగే రాజశేఖర్ కీ కాలేజ్ రోజుల్లో ఓ ప్రేమ కథ ఉంది. ఆ విషయాలను ఈ మధ్యన ఆయన గుర్తు చేసుకున్నారు.. అవి నేను కాలేజీ చదువుతున్న రోజులు. నాకంటే ఐదేళ్లు చిన్నదైన ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు ప్రపోజ్ కూడా చేశాను. ఆమె ఒప్పుకోక రిజెక్టు చేసింది. దాంతో విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నా పరిస్ధితి చూసిన ప్రెండ్స్ కొంత మంది మానసికంగా నేను బలపడటానికి భగవంతుడును ఆశ్రయించమన్నారు. అంతవరకూ నాకు ఆ విశ్వాసాల మీద నమ్మకం లేదు. అలాంటిది తొలిసారి గుడిలోకి అడుగుపెట్టాను. చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న శివాలయానికి వెళ్లాను. నువ్వంటూ నిజంగా ఉంటే ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించేలా చేయాలి అని శివుడ్ని కోరుకున్నాను. ఆశ్చర్యంగా రెండు నెలల తర్వాత ఆమె నా ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది' అంటూ నవ్వుతూ చెప్పారాయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే...ఆ అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోలేదు. అయితే ఆ చెప్పలేదు. అయితే ఆ వివాహం ఎందుకు ఆగిందో చెప్పలేదు. కానీ ఆ తర్వాత జీవిత కలవటం..ఆ బంధం వివాహానికి దారితీయటం జరిగింది. అప్పుడు ఏర్పడిన శైవ భక్తితోనే తన పిల్లలకు శివానీ, శివాత్మిక అనే పేర్లు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











