రాజశేఖర్ ఆ సినిమా ఎవర్ని తిట్టడానికి?
రాజశేఖర్ త్వరలో అర్జున అనే సినిమాలో నటించనున్నారని ఆయన భార్య జీవిత వెల్లడించారు.ఆమె మాట్లాడుతూ..ఆంద్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సినిమా ఉంటుందని,అందులో రాజశేఖర్ ఒక రైతు పాత్ర, ఆయన కుమారుడి పాత్ర అంటూ ద్విపాత్రాభినయం పోషిస్తారని ఆమె చెప్పారు.ఇక ఈ సినిమాకు కన్మణి దర్శకత్వం వహించనున్నారు.ఇక ఈ రాజకీయ చిత్రం చిరుని ఉద్దేశించా లేక వైయస్ జగన్ ని ఉద్దేశించా అన్నది ఎవరికీ క్లూ ఇవ్వలేదు.ప్రస్తుతం వారి టార్గెట్ గా వీరిద్దరే కనపడుతున్నారనేది నిర్విదాంశం.ఇక రాజశేఖర్..కొంతకాలం క్రితం మహంకాళి సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు.ఆయన కోలుకుని సినిమా షూటింగులకు హాజరవుతున్నారు.పోలీసు నేపధ్యంలో ఉండే ఈ సినిమాలో రాజశేఖర్ పోలీసు పాత్ర పోషిస్తున్నారు.జీవత ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











