For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రాజశేఖర్ తాగి తుపాకితో భయపెట్టాడని హీరోయిన్...

  By Srikanya
  |

  హైదరాబాద్: వరస ఫ్లాఫులలో ఇరుక్కుపోయిన హీరో రాజశేఖర్ కు మరో ఊహించని అవాంతరం ఆరోపణల రూపంలో వస్తోంది. గతంలో రాజశేఖర్ పై ఓ రేంజిలో విరుచుకుపడిన నీతూచంద్ర మరోసారి ఫైర్ అయ్యింది. తాగి వచ్చి తుపాకి చూపించి తనను భయపెట్టాడని ఆమె ఆరోపించింది. ఆమె చేసిన ట్వీట్ లో ఆమె ఈ విషయాలు వెల్లడి చేసింది. తన జీవితంలో అది వరస్ట్ ఎక్సపీరియన్స్ అని పేర్కొంది.

  ఈ విషయమై ఓ అభిమాని ఇంతకాలం తర్వాత ఎందుకు ఆ విషయం మళ్లీ చెప్తున్నారు అని అడిగితే...అతనో పబ్లిక్ పర్శనాలిటి..అతని గురించి పబ్లిక్ తెలియాలని అని సమాధానమిచ్చింది. తర్వాత తాను రాజశేఖర్ తో చేసిన సత్యమేవ జయితే తర్వాత ఏ చిత్రమూ అంగీకరించలేదని అంది. రీసెంట్ గా నాగార్జున తాజా చిత్రం మనం కోసం అడిగేతే తాను ఈ విషయం ప్రస్తావించానని అయితే అటువంటి సమస్య రాదని ఒప్పించి చిత్రం ఓకే చేయించారని, ఇప్పుడు తెలుగుకి తిరిగి వచ్చానని హ్యాపీగా ఉన్నానని అంది.

  Rajashekar scared heroine with gun

  గతంలో ఈ విషయమై రాజశేఖర్ మాట్లాడుతూ...వార్నింగ్ ఇచ్చిన మాట నిజమే అని సత్యమేవ జయితే ఆడియో పంక్షన్ లో ఒప్పుకున్నారు. అయితే ఆమె చెప్పినట్లు కొట్టలేదని,అనుచితంగా ప్రవర్తించలేదని అన్నారు. యూనిట్ మొత్తం షూటింగ్ స్పాట్ లో సిద్దంగా ఉంటే నీతూ చంద్ర ఫోన్ ఆఫ్ చేసుకుని మేకప్ రూంలో కూర్చూంటే నాకు కడుపు మండి వార్నింగ్ ఇచ్చానన్నారు. ఇలా ప్రవర్తిస్తే తెలుగులోనే కాదు ఏ భాషలోనూ చేయలేవని చెప్పానని అన్నారు. ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు ఆ మాత్రం మందలించే హక్కు మాకు ఉండదా అని ఆయన అప్పట్లో ఈ ఇష్యూపై స్పందించారు.

  ఇక అక్కినేని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జు, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'మనం'. ఈ చిత్రంలో నీతూ చంద్ర గెస్ట్ రోల్ పోశిస్తోంది. గతంలో ఆమె ఇదే డైరక్టర్ తో 13బి చిత్రం చేసింది. అలాగే సుమంత్ హీరోగా వచ్చిన గోదావరి చిత్రంలోనూ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. ఆ పరిచయంతో ఆమె ఈ చిత్రంలో గెస్ట్ గా కనిపించటానికి ఆసక్తి చూపింది. అదే విషయం ఆమె ట్విట్టర్,ఫేస్ బుక్ ద్వారా ఖరారు చేసింది. నాగార్జునతో ఆమె ఈ చిత్రంలో కనిపించనుంది. అయితే పాటలో కనిపిస్తుందా, సీన్ లో కనిపిస్తుందా అనేది సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది.

  English summary
  Neetu posted on her Twitter handle saying that the actor was used to be drunk and was carrying gun on the sets of the film. "My worst experience on a film set ever #ActorRajshekhar of telguindustry use to be drunk n carrying gun on sets.. That scared me," Neetu tweeted. "I didn't listen to d whole world about his reputation behaviour in the industry.come at 9 n he at 4 for shoot everyday," she further stated.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more