రూమర్లు నమ్మకండి... హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక క్లారిటీ

కరోనావ్యాధితో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై కూతురు శివాత్మిక రాజశేఖర్ మరోసారి స్పందించారు. మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మవద్దని ఆమె సూచించారు. తన తండ్రి ఆరోగ్యం కొంచెం కష్టంగా ఉంది అంటూ చేసిన ట్వీట్‌పై రకరకాల ఊహాగానాలు రావడంతో మరో ట్వీట్‌తో వివరణ ఇచ్చారు. తన తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక స్పందిస్తూ..

నాన్న ఆరోగ్యం నిలకడగా

నాన్న ఆరోగ్యం నిలకడగా

నాన్న ఆరోగ్యంపై అభిమానులు, సినీ ప్రముఖులు చూపిస్తున్న ప్రేమానురాగాలకు థ్యాంక్స్. మీ ఆదరణకు ఎలా రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నది. కానీ విషమంగా లేదనే విషయాన్ని గమనించండి. ఇప్పుడిప్పుడే నాన్న కోలుకొంటున్నారు అని శివాత్మిక తన ట్వీట్‌లో తెలిపారు.

మీ ప్రార్థనలు, దీవెనలతోనే

మీ ప్రార్థనలు, దీవెనలతోనే

నాన్న గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడానికి మీ ప్రార్థనలు, దీవెనలు కావాలి. ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దు. నాన్న త్వరగా కోలుకొంటారనే నమ్మకం బలంగా ఉంది. ఇలాంటి సమయంలో మాకు మనోధైర్యం కలిగించడానికి మీ అండ కావాలి అని శివాత్మిక తెలిపారు.

ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి

ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం అని వస్తున్న వార్తలను కూతురు శివాత్మిక ఖండించారు. నాన్న ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. ఆయన క్షేమంగా ఉన్నారు. చికిత్స స్పందిస్తూ కోలుకొంటున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం మా నుంచి వస్తేనే నమ్మండి అంటూ శివాత్మిక పేర్కొన్నారు.

Recommended Video

Gaddar Video Song Making
శివాత్మిక ట్వీట్‌తో గందరగోళం

శివాత్మిక ట్వీట్‌తో గందరగోళం

నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది అంటూ అంతకుముందు శివాత్మిక చేసిన ట్వీట్ అనేక ఊహాగానాలకు తెరలేపింది. దాంతో ఆయన ఆరోగ్యంపై పుకార్లు మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితిని గమనించిన శివాత్మిక వెంటనే స్పందించి మరో ట్వీట్‌లో తన తండ్రి ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. దాంతో ఓ గందరగోళానికి తెరపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X