రాజశేఖర్‌ను నిలదీశారు, తిట్టొద్దంటూ పక్కకెళ్లిన హీరో.... వీడియో వైరల్!

హీరో రాజశేఖర్ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నారు.ఆయన కారు రాంరెడ్డికి చెందిన మరో కారును ఢీ కొట్టింది.దీంతో రోడ్డు మీదే రాజశేఖర్ ను నిలబెట్టి నిలదీశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By Bojja Kumar

హీరో రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్న కారు మరో కారును ఢీకొట్టడం.... రోడ్డు మీద పెద్ద గొడవకు దారి తీయడం, పోలీసులు రంగ ప్రవేశం చేయడం, ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Recommended Video

Reason For Hero Rajashekhar's Behavior When He Met With An Accident

పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీద హీరో రాజశేఖర్ రాష్ డ్రైవింగ్ చేయడంతో ఆయన కారు రాంరెడ్డి అనే మరో వ్యక్తికి సంబంధించిన కారును ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత కారు దిగిన రాజశేఖర్‍ అపాలజీ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే కారు డ్యామేజ్ అయిన వ్యక్తి మాత్రం రాజశేఖర్ అపాలజీతో శాంతించలేదు. ఆయన్ను రోడ్డు మీదే నిలబెట్టి నిలదీశారు.

ప్రాణంపోతే పరిస్థితి ఏమిటి?

ప్రాణంపోతే పరిస్థితి ఏమిటి?

అపాలజీ చెప్పడానికి ప్రయత్నించి రాజశేఖర్ ను సదరు వ్యక్తి నిలదీశారు. ఎక్స్ ప్రెస్ వే మీద మీరు రాష్ డ్రైవింగ్ చేశారు. జిగ్ జాగ్ గా కారు నడిపారు. ఎవరైనా ప్రాణాలకు హాని కలిగితే పరిస్థితి ఏమిటి? ప్రాణం పోయాక అపాలజీ చెబితే సరిపోతుందా? అంటూ రాజశేఖర్‌ను నిలదీశారు.

మీరొక డాక్టర్ అయుండి ఇదేంటి?

మీరొక డాక్టర్ అయుండి ఇదేంటి?

మీరొక డాక్టర్ అయి ఉండి ఇలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఏమిటి? ప్రాణలంటే లెక్కలేదా? మీలా నిర్లక్ష్యంగా ఉండే వారిని ఊరికే వదిలేయడానికి వీల్లేదు. మీకు పనిష్మెంట్ పడాల్సిందే... అంటూ సదరు వ్యక్తి రాజశేఖర్ మీద ఫైర్ అయ్యారు.

నువ్వు సెలబ్రిటీ అయితే ఏంటి, ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే ఏంటి?

నువ్వు సెలబ్రిటీ అయితే ఏంటి, ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే ఏంటి?

నువ్వు ఒక సెలబ్రిటీ అయుండొచ్చు, నీకు చాలా ఇన్ ఫ్లూయెన్స్ ఉండొచ్చు. అవేమీ నేను పట్టించుకోను.... నీ మీద కంప్లయింట్ ఇచ్చి తీరుతాను అంటూ సదరు వ్యక్తి రాజశేఖర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం వీడియోలో ఉంది.

మైకంలో రాజశేఖర్, మిన్నకుండిపోయిన వైనం

మైకంలో రాజశేఖర్, మిన్నకుండిపోయిన వైనం

సదరు వ్యక్తి నిలదీస్తున్న సమయంలో రాజశేఖర్ కాస్త మైకంలో ఉన్నట్లు ఆయన మాట తీరు చూస్తే స్పష్టమవుతోంది. సదరు వ్యక్తి నిలదీస్తుంటే రాజశేఖర్ మిన్నకుండిపోయారు. థాంక్సూ.... మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి అంటూ రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

తిడుతున్నారంటూ పక్కకెళ్లిన రాజశేఖర్

తిడుతున్నారంటూ పక్కకెళ్లిన రాజశేఖర్

అక్కడే ఉన్న మరో వ్యక్తి రాజశేఖర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..... రాజశేఖర్ రియాక్ట్ అవుతూ.... ఆయనెవరో నన్ను తిడుతున్నారు. అంత వరకు నేను పక్కన ఉంటాను. తిట్టడం అయిపోయిన తర్వాత పిలవండి అంటూ రాజశేఖర్ పక్కకు వెళ్లిపోయారు. డాక్టర్ గారు మేము మిమ్మల్ని తిట్టడం లేదండీ.... మా బాధ చెబుతున్నాం అంటూ ఆ వ్యక్తి వ్యాఖ్యానించడం వీడియోలో ఉంది.

పోలీసుల రంగ ప్రవేశం

పోలీసుల రంగ ప్రవేశం

ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడం, ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం.... జరిగింది. అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ శిక్షించే స్థాయిలో లేదని తేలినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన చోటు

ప్రమాదం జరిగిన చోటు

పీవీ ఎక్స్ ప్రెస్ వే శివరాంపల్లి పిల్లర్‌ నంబరు 240 వద్ద కారు ఆపి సిగరెట్‌ తాగి, అనంతరం కారును తీశారు. అత్తాపూర్‌ నివాసి రాంరెడ్డి కారును ఢీకొట్టాడు. రాంరెడ్డి ఆ కారును ఆపి ప్రశ్నించారు.

డిప్రెషన్ వల్లేనంట

డిప్రెషన్ వల్లేనంట

రాంరెడ్డి వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి, రాజేంద్రనగర్‌ ఠాణాలోనూ ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజశేఖర్‌, రాంరెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. రాజశేఖర్‌కు బ్లడ్‌ ఆల్కహల్‌ కంటెంట్‌ 20 ఎంఎల్‌ చూపించింది. విషయం తెలిసిన రాజశేఖర్‌ భార్య జీవిత పీఎస్‌కు వచ్చారు. డిప్రెషన్‌లో ఉండటం వల్లే రాజశేఖర్‌ అలా చేశారని రాంరెడ్డికి చెప్పారు. దీంతో ఇరువురూ రాజీకి రావడంతో రాజశేఖర్‌ను పోలీసులు వదిలేశారు.

డిప్రెషన్‌కు కారణం ఏమిటి?

డిప్రెషన్‌కు కారణం ఏమిటి?

ఇటీవలే రాజశేఖర్ తల్లి చనిపోయారు. "చనిపోయిన తల్లి మళ్లీ రాదు.. ఇలా ఎన్ని రోజులు డల్‌గా ఉంటావు'' అంటూ కుటుంబ సభ్యులు ఆయను ప్రశ్నించారు. మాటమాట పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రాజశేఖర్‌ కారు (ఏపీ 13ఈ1234 నంబరు)తో బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ నుంచి మెహిదీపట్నంవైపు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పైనుంచి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వీడియో ఇదే...

వీడియో ఇదే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X