సినీ నటి రాజసులోచన మృతి

దక్షిణాది భాషల్లో సుమారు 274 చిత్రాల్లో నటించారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, అక్కినేని, రాజ్‌కుమార్ తదితర అగ్ర కథనాయకులతో కలిసి నటించారు. తెలుగులో నటించిన పాండవ వనవాసం, తాతామనవడు, శాంతినివాసం, జయబేరి, రాజమకుటం తదితర చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. నృత్యకళాకారిణి అయిన రాజసులోచన 1963లో చెన్నైలో పుష్పాంజలి నృత్య కళాకేంద్రాన్ని ప్రారంభించారు.
అలనాటి ప్రముఖ నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి రాజసులోచన (77) మంగళవారం కన్నుమూశారు. గస్టు 15, 1935లో జన్మించిన రాజసులోచన స్వస్థలం విజయవాడ. ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు(సీఎస్ రావు)ను ఆమె వివాహమాడారు. దేశ, విదేశాల్లో పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు సీఎస్ రావును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
రాజసులోచన అంత్యక్రియలు రేపు చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజసులోచన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











