ఛార్మికి వాళ్ళయితేనే హ్యాపీ!?

By Staff

Charmi
శశాంక్ తో అనుకోకుండా ఓ రోజు ,శివాజీతో మంత్ర ,కొత్త హీరో తో 16 డేస్ చేయిటం ఛార్మికే చెల్లింది. తాజాగా ఇప్పుడు రాజీవ్ కనకాల ప్రక్కన చేయటానికి రెడీ అవుతోంది. విశ్వసనీయ వర్గాల కధనం ప్రకారం పలు విజయవంతమైన చిత్రాలకు స్టంట్ లు కంపోజ్ చేసిన విజయ్ మాస్టర్ ఈ సినిమాతో పరిచయం కానున్నారు. ఆయన ఇప్పటికే ఒక చక్కని కధను ప్రిపేర్ చేసుకొని అన్ని విధాలు గా రెడీ అయ్యరనీ ఈ డిసెంబరు లో చిత్రం మొదలు కానున్నదనీ,పరిశ్రమలో టాప్ టెక్నీషియన్స్ ని అందరినీ సంప్రదిస్తున్నట్లు తెలిసింది.

ఇక ఛార్మీకు పెద్ద హీరోలెవరూ తమ సినిమాల్లో పాత్రలివ్వటం లేదనేది స్పష్టమైతే...ఆమెకూడా తన చుట్టూ తిరిగే కథలకే ప్రయారిటీ ఇస్తోందనేది అంత కన్నా నిజం.అందులోనూ ఆమెకంటూ ప్రత్యేకమైన మార్కెట్ తయారుచేసుకునే ప్రయత్నాల్లో ఆమె ఉంది. అందుకే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తోంది. చిన్న హీరోలు అయితే క్రెడిట్ మొత్తం తనకే చెందుతుందని ఆమె ఆలోచన. అందుకు తగ్గట్లుగానే పరిశ్రమ కూడా స్పందిస్తోంది. గతంలో విజయశాంతి ఇదే స్కీమ్ ఫాలో అయ్యింది.

విజయశాంతి మొదట్లో పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. అయితే తర్వాత తన చుట్టూ కథ తిరిగే హీరోయిన్ ఓరియెంటెండ్ పాత్రలకు ప్రయారిటీ ఇవ్వటంతో ఆమె ప్రక్కన రాంకీ,వినోద్ కుమార్,చంద్రమోహన్,సాయికుమార్ వంటి వారు మాత్రమే చేసేవారు. దాంతో ఆ తర్వాత పెద్ద హీరోలెవరూ తమ ప్రక్కన ఆమెకు చోటివ్వలేదు. ప్రస్తుతం ఛార్మీ అదే రూటులో వెళ్తోంది. భూమిక కూడా ఆమెనే అనుకరిస్తూ కొత్త పాత తేడాలేకుండా కేవలం చిన్న హీరోల ప్రక్కనే చేస్తోంది. . అయితే మరి ఇకెంత మంది ఈ ముద్దుగుమ్మల రూట్లో ప్రయాణించనున్నారో ...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X