ఫస్ట్ డేనే ఎన్టీఆర్ తో గొడవ.. సినిమా చేయనని రాజమౌళికి చెప్పేసా.. కట్ చేస్తే..

NTR - Rajeev Kanakala: యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రొఫెషనల్ పరంగా విజయాలతో సాగుతున్నారో.. ఆయన పర్సనల్ లైఫ్ కూడా అలానే సాగుతోంది. టాలీవుడ్‌లో శత్రువులెవరూ లేరు. ఆయన చాలా వరకు అజాతశత్రువుగానే ఉంటారు. అందరితోనూ స్నేహంగానే ఉంటారు. కాగా.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, యాక్టర్ రాజీవ్‌ కనకాల ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలుసు. అయితే.. వీరి పరిచయం ఎలా ఏర్పడింది? స్నేహం ఎలా బలపడింది? వంటి విషయాలను తాజాగా రాజీవ్ కనకాల పంచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య వయసులో సుమారు 14 ఏళ్ల వ్యత్యాసం. కానీ, వీళ్లద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీరికి స్నేహం కంటే ముందే ఓ పెద్ద గొడవ జరిగిందంట. ఆ తరువాత వారిద్దరూ స్నేహితులుగా మారారంట. ఇంతకీ ఎన్టీఆర్, రాజీవ్ లకు పరిచయం ఎలా ఏర్పడింది? స్నేహం ఎలా బలపడింది? అసలు గొడవెందుకు వచ్చింది? అన్న విషయాలను రాజీవ్‌ కనకాల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Rajeev Kanakala About Clashes With Jr NTR during Student No 1 Movie shooting

రాజీవ్ మాట్లాడుతూ.. 'నిన్ను చూడాలని సినిమాకు ఎన్టీఆర్‌కు డబ్బింగ్‌ చెప్పమని తొలుత నన్ను పిలిచారు. కానీ, ఎందుకో తెలియదు. తనకు నా గొంతు సరిపోదని వద్దన్నారు. దీంతో డబ్బింగ్‌ చెప్పకుండానే వచ్చాను. ఎన్టీఆరే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.' అని తెలిపారు. ఆ తరువాత 'స్టూడెంట్ నెంబర్ 1' షూటింగ్‌లో మొదటి రోజే గొడవతో తమ పరిచయం ఏర్పడింది.

'ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాం. ఆ సినిమా ఫస్ట్ సీన్ ను దర్శకులు రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. నేను భయ్యా భయ్యా అంటూ ఎన్టీఆర్ వచ్చే సీన్. మధ్యాహ్నం వరకు షూట్ చేశాం. తరవాత బ్రేక్.. సినిమా వారపత్రికలో పుస్తకం పెట్టుకుని ఎన్టీఆర్ చదువుతూ ఉంటాడు. మేము ఆ సీక్వెన్స్ చేస్తున్నాం. అంతలోనే ఆర్టిస్ట్ చంద్రశేఖర్ (ఛత్రపతి శేఖర్) కొత్త కళ్లజోడు కొనుక్కొని వచ్చాడు. ఆ కళ్లజోడు నా క్యారెక్టర్‌కు సరిపోతుందేమోనని శేఖర్‌ను అడిగి తీసి పెట్టుకున్నాను' తెలిపారు.

Rajeev Kanakala About Clashes With Jr NTR during Student No 1 Movie shooting

రాజీవ్ మాట్లాడుతూ.. 'ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ చూసి.. 'ఛ, అవసరమా' అని అందరి ముందు అనేశాడు. నన్నే అంటాడా? ఫస్ట్ డౌట్ పడ్డా.. అక్కడి పరిస్థితి చూస్తే.. నన్నేనని అర్థమైంది. వెంటనే నేను కూడా .. ' ఆ అవసరం, అందుకే పెట్టుకున్నాను' అని అన్నాను. కానీ, ఆ విషయం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం రాజమౌళి దగ్గరికి వెళ్లి.. చెప్పేశాను. నీకు దండం పెడతాను నన్ను వదిలేయ్, రెండే సీన్లు అయ్యాయి, ఇంకెవరినైనా చూసుకో.. ఆయన పైగా హరికృష్ణ గారి అబ్బాయి, నేను సినిమా చేయలేదు' అని చెప్పేశాను.

పరిస్థితిని అర్థం చేసుకుని రాజమౌళి మాట్లాడుతూ.. ఏదో సరదాగా అనుంటాడు, వదిలేయ్, అన్నీ సీరియస్‌గా తీసుకుంటావా? అని అన్నాడు. సరేలే.. నేను కూడా సైలెంట్ అయ్యారు. ఇక ఆ తరవాత రోజు చూస్తే సీన్ పూర్తిగా మారిపోయింది. రాజీవ్ గారు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఎన్టీఆర్. చాలా మర్యాద గా ఉన్నారు. నాకు అర్థం కాలేదు. ఇక మూడో రోజు.. ఎన్టీఆర్ మళ్లీ కెలికాడు. రాజాగా.. రారా అని పిలిచాడు. రాజీవ్‌గారు నుంచి రారానా? అని షాకయ్యాను. మరి ఫ్రెండంటే అనరా? ఎన్టీఆర్ అన్నాడు. నాకు అర్థమైపోయింది. చచ్చినట్టు నేను చేయాలి. తప్పుకునే ఛాన్స్ లేదు. ఇలా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే సరికి బాగా క్లోజ్ అయ్యాం. అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు'' అని రాజీవ్ కనకాల వెల్లడించారు.

More from Filmibeat

Read more about: rajeev kanakala ntr student no 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X