For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తారక్‌తో విభేదాలపై నోరు విప్పిన రాజీవ్ కనకాల: దూరం పెరగడానికి కారణమిదే.. ఇబ్బంది పెట్టొద్దన్నానంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మధ్య మాత్రమే స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. అలా టాలీవుడ్ మొత్తంలో హాట్ టాపిక్ అయిన స్నేహితుల్లో జూనియర్ ఎన్టీఆర్.. రాజీవ్ కనకాల బంధం ప్రత్యేకమైనదిగా చెబుతారు. దీనికి కారణం వీళ్లిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించడమే కాదు.. వ్యక్తిగతంగానూ సన్నిహిత సంబంధం కలిగి ఉండడమే. అలాంటిది వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై రాజీవ్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్.. చాలా చిత్రాలు

  టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్.. చాలా చిత్రాలు

  జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల తొలిసారి ‘స్టూడెంట్ నెం1' అనే సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ కాంబో సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఆది', ‘నాగ', ‘అశోక్', ‘యమదొంగ', ‘బాద్‌షా', ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఇద్దరు నటుల మధ్య స్నేహం కూడా బాగా పెరిగిపోయింది.

  RRR మూవీలో ప్రభాస్: సీనియర్ హీరోలను కూడా వాడుతూ.. ముందే లీకైన రాజమౌళి మాస్టర్ ప్లాన్

  ప్రమాదం సమయంలో తారక్‌కు తోడుగా

  ప్రమాదం సమయంలో తారక్‌కు తోడుగా

  2009లో ఎన్నికల సమయంలో తారక్ తన తాత స్థాపించిన పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం నిర్వహించాడు. ఆ సమయంలో రాజీవ్ కూడా అతడి పక్కనే ఉన్నాడు. అంతేకాదు, ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ కారులోనే ఉన్నాడు. కష్ట కాలంలో తోడుగా నిలిచిన రాజీవ్.. అతడు కోలుకునే వరకూ ఎంతో సాయం చేశాడు.

  అప్పటి నుంచి దూరంగా.. విభేదాలంటూ

  అప్పటి నుంచి దూరంగా.. విభేదాలంటూ

  గతంలో వరుసగా సినిమాలు చేసిన జూనియర్ ఎన్టీఆర్.. రాజీవ్ కనకాల.. ‘యమదొంగ' మూవీ తర్వాత వీళ్లిద్దరూ కలిసి పని చేయలేదు. అలా చాలా కాలం పాటు ఇదే కంటిన్యూ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ నటించడం లేదని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్' చేశారిద్దరూ.

  తారక్‌తో గ్యాప్‌పై నోరు విప్పేసిన రాజీవ్

  తారక్‌తో గ్యాప్‌పై నోరు విప్పేసిన రాజీవ్

  రాజీవ్ కనకాల రీసెంట్‌గా వెంకటేష్ నటించిన ‘నారప్ప'లో కీలకమైన పాత్రను చేశాడు. ఈ నేపథ్యంలో అతడు ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అదే సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు విభేదాలున్నాయన్న వార్తలపై రాజీవ్ స్పందించాడు.

  Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
  దూరం పెరగడానికి అసలు కారణం ఇదే

  దూరం పెరగడానికి అసలు కారణం ఇదే


  ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ గురించి రాజీవ్ మాట్లాడుతూ.. ‘తారక్‌తో నాకు విభేదాలున్నాయని వార్తలు వచ్చిన విషయం నాక్కూడా తెలుసు. దీన్ని ఎప్పుడో ఖండించాను. నిజంగా చెబుతున్నా మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. నేను హీరోగా కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల అతడితో కలిసి చేయలేకపోయాను. అంతేకానీ, కావాలని దూరం పెట్టలేదు' అని వెల్లడించాడు.

  ఇబ్బంది పెట్టొద్దని నేనే చెప్పాను అంటూ

  ఇబ్బంది పెట్టొద్దని నేనే చెప్పాను అంటూ

  తారక్‌తో ఫ్రెండ్‌షిప్ గురించి వివరిస్తూ.. ‘నన్ను తన సినిమాల్లో పెట్టుకోడానికి తారక్ ఆసక్తి చూపిస్తుంటాడు. ఎందుకంటే నాతో అతడికి కంఫర్ట్‌గా ఉంటుందని. యమదొంగ తర్వాత చాలా సినిమాల్లో నన్ను పెట్టుకోవాలని చూశాడు. కానీ, నా కోసం స్క్రిప్టును చెడగొట్టాల్సి వస్తుంది. దీంతో నేనే నా కోసం డైరెక్టర్లను ఇబ్బంది పెట్టొద్దు అని ఎన్టీఆర్‌తో చెప్పాను' అంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.

  అందాల ఆరబోతలో హద్దు దాటిన ప్రగ్యా జైస్వాల్: బటన్స్ మొత్తం తీసేసి రెచ్చిపోయిన హీరోయిన్

  ఆ సినిమాలను కూడా వదులుకున్నాను

  ఆ సినిమాలను కూడా వదులుకున్నాను

  దీనిని కొనసాగిస్తూ.. ‘నేను కేవలం తారక్ సినిమాలే కాదు.. నా కమిట్‌మెంట్ల వల్ల ‘బాహుబలి'తో పాటు ఎన్నో ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. చిన్న చిత్రాల దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే పెద్ద సినిమాలను వదులుకున్నాను. అందుకే రాజమౌళి చేసిన కొన్ని సినిమాల్లోనూ నేను కనిపించలేదు. అంతేకానీ గొడవలు మాత్రం ఏమీ లేవు' అని రాజీవ్ తెలిపాడు.

  English summary
  Tollywood Actor Rajeev Kanakala Recently Participated in an Interview. In This Chit Chat He Gave Clarity About Clashes and Gap with Jr NTR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X