Bubblegum: కొడుకు లిప్‌లాక్ సీన్‌పై రాజీవ్ కనకాల కామెంట్.. రాజా అలా మాట్లాడొద్దని నోర్మూయించిన సుమ

Bubblegum: యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు.. రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బబుల్ గమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేయగా... ఈరోజు టీజర్ లాంఛ్ చేశారు. సినీ ప్రముఖులందరి నడుమ చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ నిర్వహించారు. నాచురల్ స్టార్ నాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే కుమారుడి సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు కూడా సుమనే యాంకరింగ్ చేయడం మరింత విశేషం.

అయితే ఈ సందర్భంగానే రోషన్ కనకాల తండ్రి.. రాజీవ్ కనకాల సినిమా గురించి మాట్లాడారు. ఇది వరకు రాజీవ్ కనకాల అని ఎవరైనా పిలిస్తే కనకాల వినిపడగానే లేచి స్టేజీ మీదకు వెళ్లేవాడని.. కానీ ఈరోజు రోషన్ కనకాల అని పిలిస్తే నిలబడి, ఆ తర్వాత తనను కాదని తెలుసుకొని కూర్చుండిపోయినట్లు చెప్పాడు. బబుల్ గమ్ టీజర్ చూస్తుంటే రోషన్ బాగా చేసినట్లు అనిపిస్తోందని అన్నాడు. చివరాఖకి షాట్ చూసి అంటూ... స్పీచ్ ఆపేశారు. అక్కడే ఉన్న సుమ వచ్చి.. రాజా మనం కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అంటూ ఆయన నోరు మూయించింది. ఇది చూసిన ప్రేక్షకులంతా నవ్వారు.

ఆ తర్వాత సుమ.. తన కుమారుడు రోషన్ కనకాల దగ్గరకు వెళ్లి రోషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని చెబుతూ మైక్ ఇచ్చింది. ఇందుకు రోషన్ బదులు ఇస్తూ థాంక్యూ సుమ గారు అంటూ తల్లిని ఆట పట్టించాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. టీజర్ లాంఛ్ చేసేందుకు వచ్చిన నానీ అన్నకు థాంక్యూ అని చెప్పాడు. తమలాంటి యూత్ కు నానీ ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి తీసే ప్రతీ చిత్రం తనపై ఎంతగానో ప్రభావం చూపించిందని వివరించాడు. తన ఫేవరెట్ డైరెక్టర్ టైటిల్ రిలీజ్ చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు.

Rajeev Kanakala Comments About His Son Liplock Scene at Bubblegum Teaser Launch Event

తనను నమ్మి తనతో సినిమా చేసినందుకు డైరెక్టర్ రవికాంత్ కు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ లకు కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకు పని చేసిన శ్రీ చరణ్ పాకాల.. అద్భుతమైన పాటలను అందించారని రోషన్ కనకాల వెల్లడించాడు. సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకులంతా పాటలను, సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారని వివరించాడు. అలాగే జాన్వీ క్యారెక్టర్ తో ప్రతీ ఒక్కరూ ప్రేమలో పడిపోతారని స్పష్టం చేశాడు.

Rajeev Kanakala Comments About His Son Liplock Scene at Bubblegum Teaser Launch Event

అలాగే తాను ఏం చేయాలనుకున్నాడో అదే చేయనిచ్చినందుకు తల్లిదండ్రులు సుమ కనకాల, రాజీవ్ కనకాలకు ధన్యవాదాలు తెలిపాడు. తాను హీరోగా లాంఛ్ అవ్వడాన్ని తన తాత చూసి వెళ్లిపోతారనుకున్నానని.. కానీ ముందే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఎక్కడో ఓ దగ్గర ఉండి తనను, తన సక్సెస్ ను చూస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమా టీజర్ కు విపరీతమైన స్పందన వస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X