For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajeev Kanakala కు చెన్నైలో వింత అనుభవం: మూడేళ్ల తర్వాత మేటర్ లీక్.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్

  |

  మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ సహా ఎంతో మందికి నటనలో మెళకువలు నేర్పిన సీనియర్ యాక్టర్ దేవదాస్ కనకాల కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు రాజీవ్ కనకాల. మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనలోని టాలెంట్‌తో నటుడిగా మంచి పేరును తెచ్చుకున్నాడు. అందుకే సుదీర్ఘ కాలంగా తన హవాను చూపిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీగా గడుపుతోన్నాడాయన. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం రాజీవ్ కనకాల చెన్నైలో ఎదుర్కొన్న వింత అనుభవాన్ని తాజాగా బయట పెట్టాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  హాట్ క్లీవేజ్ షో కాక రేపుతోన్న రాజశేఖర్ కూతురు శివాత్మిక

  అలా ఎంట్రీ ఇచ్చాడు.. ఇలా ఫేమస్

  అలా ఎంట్రీ ఇచ్చాడు.. ఇలా ఫేమస్

  రాజీవ్ కనకాల 1996లో వచ్చిన ‘వెల్‌కమ్ బ్యాక్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి కొన్ని సీరియళ్లలో నటించాడు. ఇలా రెండు రంగాల్లోనూ తనదైన శైలి యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇలా.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం1'తో ఫేమస్ అయ్యాడు.

  యాంకర్ సుమతో ప్రేమ.. వివాహం

  యాంకర్ సుమతో ప్రేమ.. వివాహం

  కెరీర్ ఆరంభంలో కొన్ని సీరియళ్లు చేస్తోన్న సమయంలోనే మలయాళ భామ సుమతో రాజీవ్ కనకాల ప్రేమాయణం సాగించాడు. అలా చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత వీళ్లిద్దరూ 1999లో పెద్దల సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్‌లను జోరుగా కొనసాగించారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

   సినిమాల్లోనే నటిస్తూ పాపులారిటీ

  సినిమాల్లోనే నటిస్తూ పాపులారిటీ

  రాజీవ్ కనకాల తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో రకాలుగా తనలోని యాక్టింగ్ నైపుణ్యంతో సత్తా చాటాడు. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగాడు. అతడి కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ‘ఆది', ‘నాగ', ‘అశోక్', ‘యమదొంగ', ‘బాద్‌షా', ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్' వంటి చిత్రాలు చేశాడు.

  ఇప్పుడు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి

  ఇప్పుడు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నాడు రాజీవ్ కనకాల. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ బుల్లితెరపైకి కూడా కొన్ని షోల కోసం వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈటీవీలో ‘రెచ్చిపోదాం బ్రదర్' అనే డైలీ షోతో జడ్జ్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అయ్యే ఈ షో జూన్ 7 నుంచి ప్రారంభం కాబోతుంది.

  చెన్నైలో రాజీవ్‌కు వింత అనుభవం

  చెన్నైలో రాజీవ్‌కు వింత అనుభవం

  రాజీవ్ కనకాల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసి సుదీర్ఘమైన మేటర్ రాసుకొచ్చాడు. ‘ఇతను ఎవరో నాకు తెలీదు. చెన్నై ఎయిర్‌పోర్టులో వస్తుండగా.. అక్కడి సిబ్బందిలో ఒకడైన ఇతను నన్ను కలిశాడు. అప్పుడు అతడి ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది' అని చెప్పుకొచ్చాడు.

  మూడేళ్ల తర్వాత మేటర్ లీక్ చేసి

  మూడేళ్ల తర్వాత మేటర్ లీక్ చేసి

  దీనిని కంటిన్యూ చేస్తూ.. ‘ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫొటో అడిగాడు. తన దగ్గర ఫోన్ లేకపోవడంతో నా మొబైల్‌లోనే సెల్ఫీ తీయమని కోరాడు. ఆ ఫొటోను అప్పుడే పోస్ట్ చేద్దామని అనుకున్నా. కానీ, మర్చిపోయాను. దీంతో 2018 తీసిన ఈ ఫొటోను ఇప్పుడు పోస్టు చేస్తున్నా. ఆ వ్యక్తి దీన్ని తీసుకుంటాడని ఆశిస్తున్నా' అని రాజీవ్ పేర్కొన్నాడు.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  రాజీవ్ పోస్టుపై బ్రహ్మాజీ స్ట్రాంగ్ సెటైర్

  రాజీవ్ పోస్టుపై బ్రహ్మాజీ స్ట్రాంగ్ సెటైర్

  రాజీవ్ కనకాల ఫేస్‌బుక్‌లో చేసిన ఈ పోస్టుకు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్ల నుంచి విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు బ్రహ్మాజీ దీనిపై అదిరిపోయే పంచ్ వేశాడు. రాజీవ్ చేసిన పోస్టును ఉద్దేశిస్తూ.. ‘పది సంవత్సరాల తర్వాత పోస్ట్ చేయాల్సింది' అంటూ సెటైర్ వేశాడు. ఇక, రాజీవ్ షేర్ చేసిన ఆ ఫొటో వైరల్ అవుతోంది. మరి అది అతడిని చేరిందో లేదో.!

  English summary
  Tollywood Actor Rajeev Kanakala Very Active in Social Media. Recently he Shared A Photo with his Fan. In This Post.. He Revealed Emotional Moment on his Life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X