Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యాంకర్ సుమ కుటుంబంలో విషాదం: రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి కన్నుమూత
Recommended Video
సుమ-రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సుమ అత్తగారు, రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి(78) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
కళారంగానికి లక్ష్మీదేవి సేవలు:
దేవదాసు కనకాల భార్యగానే గాక.. నాట్యకళాకారిణిగా లక్ష్మీదేవి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. కళా రంగం పట్ల ఉన్న ఆసక్తితో 11ఏళ్ల వయసులోనే ఆమె నాటక రంగంలోకి ప్రవేశించారు. తొలినాళ్లలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సినీ ఆర్టిస్టులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు.
నటించిన చిత్రాలు:
నాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలే గాక.. పలు సినిమాల్లోనూ లక్ష్మీదేవి నటించారు. ప్రేమ బంధం ,పోలీస్ లాకప్, కొబ్బరి బొండం, ఒకఊరికథ లాంటి చిత్రాల్లో ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. మద్రాస్ ఇనిస్టిట్యూట్‌లో ఉపాధ్యాయురాలిగా.. సుహాసిని, శుభలేఖ సుధాకర్ లాంటి నటీనటులకు ఆమె శిక్షణ అందించారు.
దేవదాసు కనకాలతో వివాహం..:
1971 నవంబరు 21న లక్ష్మీదేవి-దేవదాస్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ కనకాల భార్య ప్రముఖ యాంకర్ సుమ అన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలక్ష్మీ కనకాల నాటకరంగ ప్రముఖుడు డా.పెద్దిరామారావును ప్రేమ వివాహం చేసుకున్నారు.
టాలీవుడ్ సంతాపం:
లక్ష్మీదేవి కనకాల మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.