Sam-Chay Divorce: ప్రేమలో పడిపోయా.. చైతూ క్యారెక్టర్ మీద రాజీవ్ కనకాల ఆసక్తికర కామెంట్స్..
చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కినేని నాగచైతన్య సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారు విడాకులు ప్రకటన చేసి కొద్ది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే వీరి విడాకుల గురించి చాలా మంది సెలబ్రిటీలు పలు విధాలుగా స్పందించగా తాజాగా రాజీవ్ కనకాల కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

మళ్ళీ బిజీబిజీగా
నటుడు రాజీవ్ కనకాల ఈ మధ్య కాలంలో మళ్లీ బిజీ అవుతున్నారు. కొంతకాలం క్రితం వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు. మొన్నీమధ్య విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాలో వెంకటేష్ బావ పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మధ్యన లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి బాబాయ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

అలాంటి పాత్రలో
నాగచైతన్య సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా లవ్ స్టోరీ. ఏషియన్ సినిమాస్ బ్యానర్ మీద సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు. సాయి పల్లవి చిన్నప్పుడు ఆమె మీద లైంగిక దాడికి పాల్పడే బాబాయ్ పాత్రలో నటించిన రాజీవ్ కనకాల పెద్ద సాహసమే చేశారు. ఇప్పటివరకు రాజీవ్ కనకాల కెరీర్ లో చేసిన పాత్రలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో చేసిన పాత్ర మరో ఎత్తు.

భయం వేసింది
ఈ పాత్ర చేస్తున్నప్పుడే దీనికి నేటివిటీ బాగా సెట్ అవుతుందని తనకు తెలుసునని అందుకే తాను ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొన్న లేను అని రాజీవ్ కనకాల అప్పట్లోనే యూనిట్ కి చెప్పారట. అయితే ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజీవ్ కనకాల నాగ చైతన్య అక్కినేని సమంత విడాకుల వ్యవహారం గురించి ప్రశ్నించగా ఆయన స్పందించడానికి ఇష్టపడలేదు.

నాకు నచ్చలేదు
అది వారి పర్సనల్ విషయం అని నేను ఏమీ మాట్లాడడానికి లేదు అని ఆయన పేర్కొన్నారు. అయితే వారు విడాకులు తీసుకున్న విషయం చాలా మందికి నచ్చలేదు అని చాలా మంది బాధపడుతున్నారు అని అనడంతో నేను కూడా బాధపడుతున్నానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు విడిపోయారు అనే సంగతి పక్కన పెడితే నాగ చైతన్యతో చాలా రోజులు కలిసి పని చేశారు కదా ఆయన ఎలాంటి వాడు అని ప్రశ్నించారు.
Recommended Video

కరెక్ట్ కాదు
నాగచైతన్య నిజ జీవితంలో చాలా మంచి వ్యక్తి అని చాలా కూల్ పర్సన్ అని అలాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చారు. ఒక మగాడిని నేనే నాగచైతన్యతో ప్రేమలో పడిపోయాను అని అంత కూల్ పర్సన్ అని ఆయన అన్నారు. ఏ విషయం చెప్పినా చాలా పాజిటివ్గా తీసుకుంటాడని సినిమా సెట్స్ లో కూడా అందరితో చాలా సరదాగా ఉంటూ తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేవాడు అని అన్నారు. ఇక విడాకుల గురించి మాత్రం రకరకాలుగా స్పందించడం కరెక్ట్ కాదని రాజీవ్ కనకాల అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











