తెలుగు సినిమాకు బాలయ్య నిజమైన లెజెండ్.. ఎన్టీఆర్ ప్రాణ మిత్రుడి కామెంట్స్
ఎన్టీఆర్‌కు ప్రాణ మిత్రులు అతి తక్కువ మంది ఉంటారు. అది కూడా సినీ పరిశ్రమకు చెందినవారిలో అయితే మరింత తక్కువ మంది ఉంటారు. వారిలో రాజీవ్ కనకాల ఒకరు. ఒక్కరోజు కూడా మాట్లాడుకోలేకుండా ఉండే అంత బంధం తమదని ఇరువురు చెప్పుకుంటారు. రాజీవ్ కనకాల లేని ఎన్టీఆర్ సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అంతలా వీరిద్దరి కాంబోకు, స్క్రిన్ ప్రెజెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. అలాంటి రాజీవ్ కనకాల బాలయ్య బాబు గురించి చెప్పుకొచ్చాడు.
నేడు బాలయ్య బాబు బర్త్ డే. నేటి 60వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎప్పటిలానే బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో చిన్నారుల మధ్య పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకున్నారు. హాస్పిటల్‌లోని తల్లిదండ్రుల విగ్రహాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ మేరకు బాలయ్య బాబు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ మొత్తం విషెస్ తెలిపింది. అందులో భాగంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. 'ఆయన గురించి మాట్లాడేందుకు ఎన్ని గంటలైనా కూర్చొని ఇట్టే చెప్పొచ్చు. ఆయన పాజిటివ్ నేచర్, దయాగుణమే ఆయన ఏంటో చెబుతాయి. లోపల బయటా ఒకేలా ఉంటారు. ఆయనతో తెరపై తెర వెనక ఆయనతో ఉన్న అనుభవం ఎంతో అద్భుతం. ఇది ఇంకా మున్ముందు కొనసాగాలి. తెలుగు సినిమాకు నిజమైన లెజెండ్' అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











