రామ్ గోపాల్ వర్మ పై రాజేంద్రప్రసాద్ సెటైర్స్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై త్వరలో రాజేంద్రప్రసాద్ సెటైర్స్ వేయనున్నాడని తెలుస్తోంది. ఎ శ్యామ్ గోపాల్‌వర్మ ఫిల్మ్ అనే టైటిల్ తో హిందీలో నిర్మాణమయ్యే చిత్రంలో రాజేంద్రప్రసాద్ హీరోగా చేయటానికి సైన్ చేసారు. పూర్తి స్ధాయి వ్యంగ్యంతో నడిచే ఆ చిత్రాన్ని నూతన దర్శకుడితో ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది.ఇక కొద్ది రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ లో ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిం,పూరీ జగన్నాధ్ అనే టైటిల్స్ ని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ ఎ శ్యామ్ గోపాల్‌వర్మ ఫిల్మ్ కథ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. నిజ జీవిత కథలను వ్యంగ్యం చేస్తారా లేక క్రేజ్ కోసం ఆ టైటిల్ ని పెట్టారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్...అయ్యారే,డ్రీమ్స్ చిత్రాల్లో చేస్తున్నారు.
డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరోగా కైపస్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'డ్రీమ్'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ "ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్' చిత్రం గ్రాఫిక్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కథ ప్రకారం డాక్టర్ రాజేంద్రప్రసాద్ నాలుగు విభిన్న రూపాల్లో కనిపిస్తారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంతకు ముందెన్నడు చేయని విభిన్నమైన పాత్రలో ఆయన నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కెరీర్‌లోనే శిఖర స్థాయిలో ఉండే చిత్రమవుతుంది. తెలుగులో నిర్మిస్తున్న మొట్ట మొదటి కల్ట్ థ్రిల్లర్ ఇది. సాంకేతికంగా యూనివర్సెల్ స్టాండర్స్‌కి తగ్గకుండా చిత్రీకరిస్తున్నాం.
నవంబరు చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవికమార్ నీర్ల, సంగీతం: సంతోష్, ఎడిటర్: బస్వా పైడిరెడ్డి, ఆర్ట్: రమణ, నిర్మాణం: కైపస్ ఫిల్మ్ ప్రొడక్షన్, దర్శకత్వం: భవానీ శంకర్


Click it and Unblock the Notifications











