ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ శృతిమించుతోంది: రాజేంద్ర ప్రసాద్

By Bojja Kumar

ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ గతి తప్పుతోందని, కొందరు వాడుతున్న డబుల్ మీనింగ్ డైలాగుల కారణంగా కామెడీ సీన్లు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండటం లేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విమర్శలపై ప్రముఖ నటుడు, ఒకప్పుడు కామెడీ హీరోగా తెలుగులో హిట్ చిత్రాలు చేసి ప్రేక్షకలను అలరించిన రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇప్పుడు కామెడీ శ్రుతిమించిందని, దారి మళ్లిందని తెలిపారు.

Rajendra Prasad about bad comedy in Telugu Movies

ప్రశాంతత కోసం గోవిందమాల ధరించిన ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం వెలుపల మీడియాతో మాట్లాడారు. నేను జంధ్యాల, బాపు, రేలంగి వంటి పెద్ద దర్శకులతో హాస్య కథానాయకుడిగా నటించానని గుర్తుచేసుకున్నారు.

తాను తన కెరీర్లో ఎంతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేశానన్నారు. అలాంటి సినిమాలను ఇప్పటికీ కుటుంబ సమేతంగా చూస్తున్నారని.. అందులో సంసారపక్షమైన హాస్యం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దారితప్పుతున్న కామెడీలో మార్పులు తీసుకురావాలని మా వాళ్లను రిక్వస్ట్‌ చేస్తున్నా. అందరిలోనే మార్పు రావాలని దేవుడి సమక్షంలో కోరుకుంటున్నా' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X