నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
నటకిరీటిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హీరో రాజేంద్రప్రసాద్. టాలీవుడ్ లో కామెడీ హీరోగా ఒక ట్రెండ్ సెట్ చేసిన రాజేంద్రప్రసాద్ సినిమాలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అప్పటికి ఇప్పటికి అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ తనకు జరిగిన ఆర్థిక మోసం గురించి ఒక వివరణ ఇచ్చారు.

కాలానికి తగ్గట్లుగా..
ఎంతో కష్టపడి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన రాజేంద్రప్రసాద్ కాలానికి తగ్గట్లుగా తన స్టైల్ ను మార్చుకుంటు వస్తున్నారు. హీరోగా చేసిన సమయాల్లోనే గెస్ట్ రోల్స్ స్పెషల్ రోల్స్ అంటూ ఎంతో బిజీగా ఉండేవారు. హీరోగా మార్కెట్ తగ్గిన అనంతరం మెల్లమెల్లగా యువ హీరోలు సినిమాల్లో మళ్ళీ స్పెషల్ పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు.

రెమ్యునరేషన్ ని లెక్క చేయలేదు..
ఒకప్పుడు ఏడాదికి 15 సినిమాలు చేసిన ఘనత ఆయనది. ఎవరు లేనంత బిజీగా ఉండేవారు. అయితే రెమ్యునరేషన్ ను ఏ మాత్రం లెక్క చేసేవారు కాదట. నటనకు డబ్బుతో విలువ కట్టడం తనకు ఏ మాత్రం నచ్చదని అంటూ ఎంత ఇచ్చినా చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. కేవలం నటన పరంగా నా పాత్ర ఎంతవతకు ఇంపార్టెంట్ అనే దానిపైనే తన ఫోకస్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

ఆ విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాను
రాజేంద్రప్రసాద్ నెక్స్ట్ గాలి సంపత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోని పాత్ర ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కాబట్టి నాకు ఇచ్చారు. అక్కడే మన వాల్యూ ఏమిటో అర్ధమవుతుంది. అందుకే నటుడిగా నా పాత్ర ఏ మేరకు బావుంది అనే విషయాన్ని మాత్రమే నేను ఆలోచిస్తాను అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఆస్తులు మొత్తం పోయాయి
అయితే రాజేంద్రప్రసాద్ ఒకనొక సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయినట్లు చెప్పారు. నమ్మిన వాళ్లే మోసం చేశారని అలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. సినిమాలతో నిత్యం బిజీగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారని అయితే ఒకానొక సమయంలో తెలియకుండానే ఆస్తులు మొత్తం మాయమైనట్లు చెప్పారు.

ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు..
చివరికి ఒక ఇల్లు తప్ప తనకు ఏమి మిగల్లేదని, కారణం ఎలాంటిదైనా కూడా అప్పుడు పెద్దగా బాధ పడలేదని తెలిపారు. కానీ జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేసినట్లు చెబుతూ ప్రస్తుతం నేను అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నానని అన్నారు. నాకు డబ్బు కన్నా కూడా ఒక నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవలనే కొరిక ఒక్కటే బలంగా ఉందని అంటూ.. నా తుది శ్వాస వరకు ఇలానే ఉండాలని అనుకుంటున్నట్లు రాజేంద్రప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











