సినీ చరిత్రలోనే తొలిసారిగా లైవ్ గా...రాజేంద్రప్రసాద్
సినీ చరిత్రలోనే తొలిసారిగా బ్రహ్మ మూడు తలలను లైవ్ గా చూపించాం. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. నేను ఎంతో ఇష్టపడి ఈ బ్రహ్మదేవుని పాత్ర పోషించాను. ఈ పాత్ర నాకు దొరకడం చాలా ఆదృష్టం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. అందుకే బాసర వెళ్లి సరస్వతీదేకి నా కృతజ్ఞతలు చెప్పుకోబోతున్నాను' అన్నారు డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆయన బ్రహ్మదేవునిగా నటించిన 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్బంగా ఆయన మీడియోతో మాట్లాడారు. తాను అవకాసం వచ్చినప్పుడు ఒప్పుకోవటానికి కారణం చెబుతూ.."బ్రహ్మదేవుని పాత్ర నేనెందుకు వేయాలి? మొదట ఈ ప్రశ్నే వేశాను. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లోని బ్రహ్మ పాత్రల్లో నాలుగింటిలో మూడు తలలు డమ్మీగానే ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆ మూడూ కూడా మాట్లాడతాయనే విషయం నచ్చి ఒప్పుకొన్నాను. మనకంటే కూడా మనకొచ్చిన అవకాశం గొప్పది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటేనే నటుడిగా విలువ" అన్నారు రాజేంద్రప్రసాద్.


Click it and Unblock the Notifications











