రిటైర్డ్ మేజర్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్...!

By Sindhu

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ మేజర్ గా నటిస్తూ ఓ నూతన చిత్రం రూపుదిద్దుకొంటుంది. వివరాలప్రకారం రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా కైపస్ ఫిలింస్ ప్రొడక్షన్స్ హౌస్ సంస్థ భవాని శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాదు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఈ చిత్ర విశేషాలను డా.రాజేంద్ర ప్రసాద్ తెలుపుతూ ఒక పెద్ద బంగాళా యజమాని మాజీ ఆర్మీ అధికారి .ఆ అధికారి అధికారంలో ఉన్నన్నిరోజులూ క్షణం తీరిక లేకుండా కష్టపడ్డాడు.ఆయనకు ఒక కుమారుడు. ఆ కుమారుడు అమెరికాలో వుంటాడు.ఆర్మీ ఉద్యోగ విరమణ అనంతరం కాలంగడవడమే కష్టమైపోతుంది. ఎదో తెలియని ఒంటరి తనం వారిని వేధిస్తుంది.ఆ ఒంటరి తనాన్ని భరించలేక ఆ రిటైర్డ్ మేజర్ ఏమిచేసాడో తెరపై చూసి తెలుసుకోవలసిందే అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఈ చిత్రంలో మేజర్ పాత్రలో తాను నటించానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మంగళవారం నాటికి ఆయనకు యాభై ఐదేళ్లు నిండుతాయని, ఈ సమయంలో నటుడిగా నిరూపించుకొనే పాత్రలు రావడం నిజంగా సంతొషంగా వుందని తెలిపారు. ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా అంతర్జాతియ విలువలున్న చిత్రంగా నిలుస్తుందని తన నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఈ చిత్రంతో పాటూ రాజేంద్రప్రసాద్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'మొగుడు' లో, అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలొ రూపుదిద్దుకొంటున్న'నారాయణ రావు మేస్టారు' అనే పాత్రలోనూ నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X