డేవిడ్ వార్నర్ విషయంలో ఆ తప్పు చేశా.. క్షమాపణ చెప్పిన రాజేంద్ర ప్రసాద్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎంత మంచి వ్యక్తో అందరికీ తెలిసిందే. హీరోగా తన కెరియర్ ను ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్ ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం కీలక పాత్రల్లో పోషిస్తూ ఆయా చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. తన వయస్సుకు రీత్యా పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ నితిన్ రాబిన్ హుడ్ చిత్రంలో నటించారు. జాన్ స్నో అనే పోలీస్ అధికారి పాత్రలో అలరించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన పోస్టర్లలో రాజేంద్ర ప్రసాద్ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
అయితే, రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా జరిగిన 'రాబిన్ హుడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. నటీనటులు, దర్శకుడు, టెక్నీషియన్ల గురించి మంచి మాటలు చెప్పారు. తన పాత్ర గురించి కూడా మాట్లాడి హైప్ పెంచారు. కానీ చివర్లో ఎవరూ ఊహించని విధంగా మాట్లాడి షాక్ కు గురిచేశారు. 'రాబిన్ హుడ్' చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా, ఆర్టిస్ట్ గా హాజరైన ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరుష పదాలతో ఇంచుమించుగా పచ్చిబూతులు తిట్టారు.

కాగా, రాజేంద్ర ప్రసాద్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన స్పందించారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. డేవిడ్ వార్నర్ పై కావాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తను ఎలా ఉంటారో, ఎలా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే కదా అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆ ఈవెంట్ లో మాట జారిందంటూ తప్పును ఒప్పుకున్నారు. ఎలాంటి సందేహం లేకుండా క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఎవరి మనస్సు నొప్పించాలని అలా మాట్లాడలేదని, ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి అని అడిగాడు.
ఇక రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ఒరేయ్ డేవిడ్ వార్నరూ.. దొంగ ముం...డా కొడుకా... నువ్వు మాములోడివి కాదురోయ్.. క్రికెట్ ఆడమంటే స్టేడియంలో అలా స్టెప్పులేట్రా అంటూ ఫన్నీగా కామెంట్లు పేల్చారు. కానీ ఆయన హాస్యం అసహాస్యం అయ్యింది. డేవిడ్ వార్నర్ అభిమానుల మనస్సు నొచ్చుకునేలా చేశాయి. మరోవైపు అంత పెద్ద నటుడై అలాంటి చీప్ మాటలు మాట్లాడటంతోనూ ఆయన పట్ల గౌరవం పొగొట్టుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా రాజేంద్ర ప్రసాద్ మాటలతో మనస్సు నొచ్చుకున్న వారందరికీ ఆయన క్షపమాణలు చెప్పడం, ముఖ్యంగా డేవిడ్ కు సారీ చెప్పడంతో సమస్య సర్దుమణిగింది. ఇక నితిన్, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా జంటగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్ లో 'భీష్మ' తర్వాత ఈ చిత్రం రాబోతుండటంతో హైప్ నెలకొంది. కేతికా శర్మ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆ లిరికల్ వీడియో విడుదలై యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం విశేషం.
డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3
— Milagro Movies (@MilagroMovies) March 25, 2025


Click it and Unblock the Notifications











