Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నారాయణరావు మాష్టారుగా కొత్తగెటప్‌లో కనిపించనున్న రాజేంద్ర ప్రసాద్
త్వరలో రాజేంద్ర ప్రసాద్ నారాయణరావు మాష్టారుగా కొత్తగెటప్‌లో కనిపించనున్నారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు ధరించి ప్రేక్షకాదరణ చూరగొన్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో వైవిథ్యమైన పాత్రని పోషించటానకి రెడీ అవుతున్నారు. కె.క్రాంతి మాధవ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న(సోమవారం) ప్రసాద్ ల్యాబ్స్ లో మొదలైంది. రాజేంద్రప్రసాద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్‌ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచాన్ చేయగా, గిరిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విభిన్న పాత్రలు పోషిస్తూ, ప్రత్యేకతరహా నటుడిగా చేస్తున్న సమయంలో లేడీస్టైలర్ వంటి చిత్రం చేసే అవకాసం వచ్చింది. ఆ విధంగా కొత్తదనానికి ప్రేక్షకుల ఆశీస్సులు లభించాయి. ఈ చిత్రంలో చేస్తున్న నారాయణరావు మాష్టారు కథ వినగానే పులకరింత కలిగింది. తెలుగువారికి సంప్రదాయాలు ఎక్కువ. తల్లిదండ్డి తర్వాత గురువుకు స్థానం ఉంటుంది. ఆ గురువును గుర్తుచేస్తూ తీస్తున్న చిత్రమిది. మానాన్నగారు కూడా స్కూల్ మాష్టారుగా పనిచేశారు. ఈ చిత్రానికి బాగా చదువుకున్న క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు అని చెప్పారు.