ఆ చిత్రంలో శ్రీకృష్ణుడిగా రాజేంద్రప్రసాద్‌

By Srikanya

క్విక్ గన్ మురగన్ కనిపించి అలరించిన రాజేంద్రప్రసాద్ త్వరలో శ్రీకృష్ణుడుగా కనిపించి రంజింపచేయబోతున్నాడు. శివాజీ, అర్చన జంటగా చేగొండి హరిబాబు నిర్మిస్తున్న 'ఏమైంది నాలో' చిత్రంలో ఈ పాత్ర కనపడనుంది. ఈ చిత్రం సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. రచయిత రాజేంద్రకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ.."అదొక అందమైన కాలేజీ. ఎందుకంటే అక్కడ చాలా అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు కాబట్టి. ఈ కాలేజీ ఆవరణలో అకస్మాత్తుగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు అంటే... ఇక్కడ ఏ లెక్చరరో, స్టూడెంటో అనుకునేరు. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే. భగవంతుడికి కాలేజీలో పని ఏంటనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్‌. ఆ వింతలూ విడ్డూరాలు తెలుసుకోవాలంటే 'ఏమైంది నాలో' చిత్రం చూడాల్సిందే' అంటున్నారు.

అలాగే సమర్పకురాలు చేగొండి భారతి తెలియజేస్తూ "కాలేజీ నేపథ్యంలో జరిగే ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీలో శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడనేది ఆసక్తికరం. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌ల మీద చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌. ఇప్పటికే ఈ సినిమా పాటలు సూపర్‌ హిట్టయ్యాయి. ప్రేమకథల్లో ఓ కొత్తకోణాన్ని చూపించే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ముఖ్యంగా యువతనిబాగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, సినిమాటోగ్రఫీ: జయరామ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X