twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "బేవార్స్" ఎమోష‌న‌ల్ హిట్‌ .. ఇంకా దాసరి మా వెంటే ఉన్నట్టు.. రాజేంద్రప్రసాద్

    |

    కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌. ఎస్‌.కె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల చందు, డా.ఎం.ఎస్‌.మూర్తి, ఎమ్‌. అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం బేవ‌ర్స్‌ . ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సునీల్‌క‌శ్య‌ప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 12న ప్రంపంచ‌వ్యాప్తంగా విడుద‌లై విజయం సాధించింది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో న‌ట‌కీరిటి రాజేంద్ర‌ప్ర‌సాద్, తదితరులు మాట్లాడుతూ..

    కథని నమ్మాం.. ఆదరణ వస్తున్నదని..

    కథని నమ్మాం.. ఆదరణ వస్తున్నదని..

    తెలుగు ప్రేక్ష‌క‌దేవుళ్ళ‌కి న‌మ‌స్కార‌ములు తెలియ‌జేస్తూ బేవార్స్ చిత్రాన్ని ఎమోష‌న‌ల్ హిట్ చేసినందుకు మా చిత్ర యూనిట్ త‌ర‌పున అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. సినిమా అనేది ఒక క‌థ‌. క‌థని న‌మ్మి ఇంత‌మంచి ఆద‌ర‌ణ రావ‌డం సంతోషం. మాన‌వీయ విలువ‌ల్ని ఈ రోజు స‌మాజంలో ఏం జ‌రుగుతుంది అని, మా పాత్ర‌ల గురించి బాగా రాశారు. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు. ఈ క‌థ‌లో మేం ఏం చెప్పాం అన్న పాయింట్‌ని తీసుకుంటే ఈ క్రెడిట్ మొత్తం ర‌మేష్‌చ‌ప్పాల‌కి ద‌క్కుతుంది అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

    సినిమాలు ఆడకపోతే థియేటర్స్

    సినిమాలు ఆడకపోతే థియేటర్స్

    ఎన్నో చిన్న సినిమాలు బాలేక‌పోతే థియేట‌ర్స్ నుంచి తీసేసిన రోజులున్నాయి. కానీ సినిమా బావుంద‌ని థియేర్స్ పెంచ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా చిత్రం బావుంద‌ని ఒక 10 థియేట‌ర్లు పెంచ‌డం ఆనందంగా ఉంది. మా మామ‌గారు దాస‌రినారాయ‌ణ‌రావుగారు న‌న్ను నోరారా అల్లుడు అని పిలిచేవారు. ఆయ‌న ఇప్పుడు ఇక్క‌డ లేక‌పోయినా ఎప్పుడూ చిన్న సినిమాల వెంటే ఉండేవారు. చిన్న సినిమాల‌ను ఇంకా మీరంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు.

    చాలా సంతోషంగా

    చాలా సంతోషంగా

    కాశీ విశ్వ‌నాధ్‌ మాట్లాడుతూ... యూనిట్ అంద‌రికీ చాలా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుడు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు. ఆయ‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప్ర‌తి ఫంక్ష‌న్‌కి రావ‌డం చాలా గ్రేట్‌. అలాంటి ఆర్టిస్ట్‌తో క‌లిసి న‌టించినందుకు చాలా గ‌ర్వ ప‌డుతున్నాను. ఈ సినిమాని రూపొందించినందుకు ర‌మేష్‌చ‌ప్పాల‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

    చిత్రంలో న‌టించే అవ‌కాశం

    చిత్రంలో న‌టించే అవ‌కాశం

    దివ్య‌వాణి మాట్లాడుతూ... ఈ సినిమా లొ సిరి అనే పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం చేస్తున్న‌ప్పుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి స‌పోర్ట్ నేను మ‌ర్చిపోలేను. నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ర‌మేష్‌గారికి అంద‌రికి నా కృతజ్ఞ‌త‌లు అన్నారు.
    హీరోయిన్ మాట్లాడుతూ... న‌న్ను ఈ చిత్రం ద్వారా ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ప్రేక్ష‌కుల నుంచి ఇటువంటి ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని నేను ఎక్స్‌పెక్ట్ చెయ్య‌లేదు. న‌న్ను ఈ చిత్రంలో భాగంగా చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

    ఎమోష‌న‌ల్ విలువ‌లున్న మూవీ

    ఎమోష‌న‌ల్ విలువ‌లున్న మూవీ

    హీరో సంజూష్ మాట్లాడుతూ... చాలా హ్యాపీగా ఉంది. ఎమెష‌న‌ల్ హిట్ అయినందుకు. ఈ సంద‌ర్భంగా చెప్పుకోవ‌ల్సింది మంచి ఎమోష‌న‌ల్ విలువ‌లున్న మూవీ చాలా మంచి మూవీ తీశారు. అంద‌రికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు కూడా చాలా స‌పోర్ట్ చేశారు. నా ప్రొడ్యూస‌ర్స్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. మా డైరెక్ట‌ర్‌గారిది, నాది న‌మ్మ‌కం ఓకే అయింది అన్నారు.
    ద‌ర్శ‌కుడు ర‌మేష్ చెప్పాల మాట్లాడుతూ... అక్టోబ‌ర్ 12న విడుద‌లై ఈ చిత్రం మంచి స్పంద‌న వ‌చ్చింది. మంచి ఆడియో, వీడియో ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో 9 థియేట‌ర్ల‌లో నైజాంలో5 థియేట‌ర్లు పెంచ‌డం జ‌రిగింది. చాలా మంచి మూవీ ఇది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారికి అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

    క‌థ, స‌బ్జెక్ట్ న‌చ్చి

    క‌థ, స‌బ్జెక్ట్ న‌చ్చి

    ప్రొడ్యూస‌ర్ పొన్నాల చందు మాట్లాడుతూ... ఇది నా తొలి సినిమా. ఈ క‌థ స‌బ్జెక్ట్ న‌చ్చి నా మ‌న‌స్ఫూర్తిగా చేశాను. ఈ జ‌ర్నీలో నాకు చాలా అనుభ‌వం వ‌చ్చింది. ఇంత మంచి హిట్ అయినందుకు గ‌ర్వంగా ఉంది. రాజేంద్ర‌ప్ర‌సాద్ అంద‌రూ ఆర్టిస్టుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వ‌ల్లే నేను ఇంత దూరం రాగ‌లిగాను నాకు మా నాన్న‌గారు చాలా స‌పోర్ట్ చేశారు. నాకంటే ప్ర‌త్యేకించి ఏది ఒక ప్లాన్ లేదు. ఆయ‌న ప్రోత్సాహంతోనే ఇంత దూరం సాగాను. న‌న్ను మీరందరూ ఇదే విధంగా ఆద‌రించాల‌ని నేను ఇంకా ఎన్నో చిత్రాలు తియ్యాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

    English summary
    Bewaars movie is geeting positive note from the all corners. In This is occassion, film unit organised success meet. In this event, Rajendra Prasad said that Audience has given emotional hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X