twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వుల రాజు..రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు నేడు

    By Bojja Kumar
    |

    నట కిరీటిగా...నవ్వుల పండిచే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. అతన్ని కొందరు ఆంద్రా చాప్లిన్‌ అంటారు. నవ్వుల కిరిటి అనీ నవ్వుల రారాజనీ మరికొందరు అంటారు. ఇతను రాజబాబు నక్షత్రంలో రేలంగి రెండో పోదంలో హాస్యపు ఘడియల్లో పుట్టాడు ఇంకొందరు. ఈ రోజు ఈ నవ్వుల హీరో పుట్టిన రోజు.

    రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన గమ్యం వెతుక్కుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని... చిన్న చిన్న వేషాలతో సర్దుకు పోతూన్న రాజేంద్ర ప్రసాద్‌ తొలి చిత్రం 1977లోని స్నేహం. 1982లో వొచ్చిన మంచుపల్లకి చిత్రంతో బ్రేక్‌ వొచ్చింది. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్‌.

    హాస్య బ్రహ్మ జంధ్యాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ చేసిన 'రెండురెళ్ల ఆరు', 'అహనా పెళ్లంట' మంచి పేరు తెచ్చి పెట్టాయి. లేడిస్ టైలర్, ఏప్రిల్ 1, మాయలోడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఇ.వి.వి సత్యనారాయణ తీసిన సినిమాలో అప్పుల అప్పారావులో ఆయన పండించిన హాస్యం అందర్ని కడుపుబ్బ నవ్వించింది.

    రాజేంద్ర ప్రసాద్ కేవలం హాస్య నటుడే కాదు. అద్భతమైన నటుడు కూడా. అన్ని పాత్రలో ఇట్టే ఒదిగి పోతారు. హాస్య ప్రధాన పాత్రలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో రాజేంద్రప్రసాద్ నటించి మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిల్యూట్స్‌లో ఎన్నొ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంలో అతని నట విశ్వరూపమే చూడొచ్చు. ఎర్రమందారం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు.

    శాఖాహారం మాత్రమే తీసుకోవాలనే ఓ మంచి ఉద్దేశ్యంతో... క్విక్‌గన్‌మురుగన్‌ అనే ఆంగ్ల చిత్రం ద్వారా అంతర్జాతీయంగా కీర్తిని సంపాదించిన ఈ నట కిరీటి ఈనెల 27న 'ఓనమాలు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమ్మ, సొంతఊరు, చదువుకున్న బడి, ఆడుకున్న గుడి... ఇవి ఎప్పుడూ జ్ఞాపకాలు కావు. మనలోని భాగాలు. నిరంతరం మనల్ని ముందుకు నడిపించే మూలాలు. ఏదో ఒక సందర్భంలో నిస్పృహకు లోనైనపుడు మనలో చైతన్యాన్ని నింపే ఉత్ప్రేరకాలు. ఈ నిత్యసత్యాలకు తెర రూపాన్నిస్తూ రూపొందిన సినిమానే 'ఓనమాలు'. రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడూ ఇలా తన నటనతో ప్రేక్షకులను అలరించాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

    English summary
    Natakireeti Dr. Rajendra Prasad, born as Gadde Rajendra Prasad in Nimmakuru, is celebrating his birthday today. This versatile and extremely talented actor was born on 19th July 1956 and he made his Telugu Film debut in 1977 with the film ‘Sneham’. Rajendra Prasad is known for his comedy roles and for his extreme versatility in adapting himself to different roles. He is one of the very few method actors in our industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X