పుష్ప లో అల్లుఅర్జున్ దొంగే క‌దా.. : మరోసారి రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్

Allu Arjun-Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన తన నట ప్రస్థానంలో ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రూల్స్ లో నటించి మెప్పించారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజేంద్రప్రసాద్. అయితే.. తన కెరీర్ లో ఏ రోజు కూడా వివాదాల జోలికి వెళ్లలేదు. అయితే.. గత కొన్నిరోజుల క్రితం.. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పై రాజేంద్ర ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారంటూ పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఏమన్నారంటే..

అసలేం జరిగిందంటే.. టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. గతంలో 'హరికథ' అనే సినిమా ప్రెస్ టీంలో నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'నిన్న గాక మొన్న చూశాం.. ఎర్ర చందనం స్మగ్లర్ వాడు హీరో హీరోనా.. నేడు హీరో క్యారెక్టర్ మారిపోయింది. ఏ నేను హీరోనా.. లేడీస్ టైలర్ హీరోనా ? వాడో పెద్ద సన్యాసి.. అప్పుల అప్పారావు హీరోనా? వాడు వెధవ.. ఏప్రిల్ ఒకటి విడుదల వాడొక పెద్ద దొంగ.. ఇవన్నీ మన చుట్టూ ఉన్న పాత్రలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు' అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Rajendra Prasad clarifies his remarks about Allu Arjun s Pushpa 2 after facing trolls

అల్లు అర్జున్ పై నటుడు రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడంటూ, పుష్ప సినిమాను తప్పుపడుతున్నారంటూ పలు విధాలుగా కథనాలు వెలుగులోకి వచ్చాయి. టాలీవుడ్లో ఈ విషయం కాంట్రవర్సీగా మారడంతో తన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా తాను కామెంట్ చేశానంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. ఇటీవల తాను ప్రధాన పాత్రలో నటించిన 'షష్టి పూర్తి' అనే సినిమా ప్రెస్ మీట్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ స్పందించారు. తన మాటలను వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమాలో హీరో పాత్రపై నా కామెంట్స్ ను సోషల్ మీడియాలో వక్రీకరించారు. ఇటీవల అల్లు అర్జున్ ను కలిసినప్పుడు ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం.. ఈ సమయంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆ మాట మాట్లాడలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నానురా.. అయినా మీరు అన్నది ఆ ఉద్దేశంతో కాదు అని అల్లు అర్జున్ అన్నారని తెలిపారు. నేను అన్న ఉద్దేశం వేరు కానీ ఎవడికో పాపం.. నవ్వుకున్న సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగిటివ్ గా చూపించకూడదు. మీ వ్యూస్ కోసం టైటిల్స్ అలా పెట్టొద్దు. అందులో ఏముండదు కానీ, సమాజంలో నెగిటివిటీ అవుతుంది. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై హీరోలుగా తీస్తున్నారు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై ప్రతిబింబిస్తున్నాం. 'లేడీస్ టైలర్', 'అప్పుల అప్పారావు' లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ'' అని చెప్పారు.


ఇదిలాఉంటే.. ప్రస్తుతం.. రాజేంద్రప్రసాద్,సీనియర్ నటి అర్చన 'షష్టిపూర్తి'. పవన్ ప్రభాస్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను రుపేశ్ చౌదరి నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X