ఓరి పిచ్చా నా ** :పుష్ప 2 వివాదంపై రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ..
Allu Arjun-Rajendra Prasad: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై రాజేంద్రప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారంటూ పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ నటకిరీటి రాజేంద్రప్రసాద్ .. అల్లు అర్జున్ ను ఏమన్నారంటే..
తెలుగు సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రూల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన 48 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకున్నారు. ఆయన వివాదాలకు ఇప్పుడు దూరంగానే ఉంటూ అందరి గురించి పాజిటివ్ గానే మాట్లాడతారు. అయితే తాజాగా పోయి ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడదు అల్లు అర్జున్ పై నోరు జారారు అంటూ కొన్ని కథనాలు వైరల్ గా మారాయి.

అసలేమైందంటే..? హీరో రాజేంద్రప్రసాద్ 'హరికథ' అనే సినిమాలు లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యాగీ దర్శకత్వం వహించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'నిన్న గాక మొన్న చూశాం.. ఎర్ర చందనం స్మగ్లర్ వాడు హీరో హీరోనా.. నేడు హీరో క్యారెక్టర్ మారిపోయింది. ఏ నేను హీరోనా.. లేడీస్ టైలర్ హీరోనా ? వాడో పెద్ద సన్యాసి.. అప్పుల అప్పారావు హీరోనా? వాడు వెధవ.. ఏప్రిల్ ఒకటి విడుదల వాడొక పెద్ద దొంగ.. ఇవన్నీ మన చుట్టూ ఉన్న పాత్రలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు' అంటూ కామెంట్ చేశారు. అయితే ఆ కామెంట్స్ ని తప్పుదారి పట్టిస్తూ అల్లు అర్జున్ పై పుష్ప సినిమా పై కామెంట్స్ చేశారంటూ ఇష్టం వచ్చినట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ తప్పడు కథనాలపై సీనియర్ నటుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసి తప్పుడు ఆలోచన లేదని, బన్నీని తన బిడ్డ లాగా భావిస్తానని అన్నారు. అల్లు అర్జున్ ఐ లవ్ యు..అంటూ పేర్కొన్నారు. ఈ వార్తలను చూసినప్పుడు తనకు నవ్వొచ్చిందని, తన 48 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు లేనిది, తాను నెగటివ్ గా మాట్లాడినట్టు ఏదో వివాదాన్ని క్రియేట్ చేసినట్లు.. ఎవడో కలర్ ఇచ్చాడు. వాడెవడో తెలియాలి కానీ.. పుష్ప2 పై నేనేమో కామెంట్లు చేసినట్లు, నేనే దొంగ అని కామెంట్ చేసినట్లు వార్తలు రాసిన వాళ్ళు ఎవరో తెలియాలి గాని అంటూ సీరియస్ అయ్యారు.
తాను కామెంట్ చేసిన కామెంట్స్ వేరని, ఆ సందర్భం కూడా వేరేనని తెలిపారు. ప్రస్తుతం హీరో క్యారెక్టర్రైజేషన్ మారిపోయిందని, తాను లేడీస్ టైలర్ నుండి నిన్నటి లగ్గం సినిమా వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చూశాను. ప్రతి ఇంట్లో.. ఒక గ్లాసు, ఒక మంచం, ఒక కంచం ఉన్నట్లే తన సినిమా కూడా ఉంటుందని, తన సినిమాను చూసి ఎంతోమంది రిలీఫ్ పొందుతారని అన్నారు. కానీ,బన్నీపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్.
అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి ప్రేమ, బన్నీ తనకు బిడ్డలాంటివాడని మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. జూలాయి, అలా వైకుంఠపురం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు బన్నీతో చేశానని, తనకు అల్లు అర్జున్ కు ఉన్న రిలేషన్ ఏంటో ఇండస్ట్రీలో అందరికి తెలుసని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే.. అజ్ఞానంతో అవివేకంతో తనని నెగిటివ్ షేఢ్ లో చూపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వార్తలు రాసి ఉంటారని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











