Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సమంత బాయ్‌ఫ్రెండ్ నేనే.. రాజేంద్రప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్
వెండితెరపై కామెడీ చేస్తూనే హీరోయిజం పండించే హీరోలు కొందరే ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు రాజేంద్రప్రసాద్. గత నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఆయన ఎన్నో సినిమాల్లో హాస్యం పండించారు. నవ్వుల రారాజుగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నేటికీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తూ పలు క్యారెక్టర్స్ లో అలరిస్తున్నారు. ఈ సందర్బంగా ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఆసక్తి కలిగించాయి.
ఓ బేబీ రాజేంద్రప్రసాద్
సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న ఓ బేబీ సినిమాలో రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్ర పోషించారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 5 వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో ఓ బేబీ సంగతులు, చిత్రంలో సమంతతో తన రిలేషన్షిప్ లాంటి సంగతులు వివరించారు రాజేంద్రప్రసాద్.
సమంత బాయ్‌ఫ్రెండ్ నేనే
సమంత బాయ్‌ఫ్రెండ్ నేనే.. అనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు రాజేంద్రప్రసాద్. ఓ బేబీ సినిమాలో 60 ఏళ్ల ముసలావిడ (లక్ష్మి), 20 ఏళ్ల పడుచు పిల్ల (సమంత) శరీరం లోకి చేరి చేసే కామెడీ కడుపుబ్బా నవ్వించనుంది. అయితే అటు లక్ష్మికి, ఇటు సమంతకు ఇద్దరికీ నేనే బాయ్‌ఫ్రెండ్‌ని.. అదే అసలు ట్విస్ట్ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
నేటితరం నటీనటులతో పెద్ద కష్టమేమీ కాదు
సీనియర్ నటులు నేటితరం నటీనటులతో నటించడం కష్టం కాదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నాడు. నేటి యూత్ ఆలోచనలతో ఏకీభవించి ఆలోచిస్తే సెట్స్ పై పని చాలా సులువైపోతుందని ఆయన చెప్పారు. ఓ బేబీ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఇదే అనుభవం ఎదురైందని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
రాజేంద్రప్రసాద్ న్యూ మూవీస్
ఓ బేబీ సినిమాతో పాటుగా బుర్రకథ, కౌసల్య కృష్ణమూర్తి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు రాజేంద్రప్రసాద్. మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా ఆయన భాగం అవుతున్నారు. మహేష్ 'సరిలేరు నీకెవ్వరు', టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాని అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాల్లో రాజేంద్రప్రసాద్ రోల్ చాలా ముఖ్యమైందని సమాచారం.
ఓ బేబీ మూవీ
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమా తెరకెక్కింది. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ జూలై 5న ఓ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.