twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పృథ్వీకి షాకిచ్చిన రాజేంద్రప్రసాద్.. జగన్‌ని కలుస్తానంటే ఆయనే!

    |

    Recommended Video

    Actor Rajendra Prasad Counter To Comedian Prudhvi Raj || Filmibeat Telugu

    ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన హాస్యనటుడు పృథ్వీరాజ్ వారిలో ఒకరు. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించాలని చూస్తున్న ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఆయన తన నోటికి పని చెప్పి సినీ ఇండస్ట్రీలోని పెద్దలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పృథ్వీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి పోతే..

     151 సీట్లు గెలిచిన నాయకున్ని పట్టించుకోవడం లేదు

    151 సీట్లు గెలిచిన నాయకున్ని పట్టించుకోవడం లేదు

    వైఎస్ జ‌గ‌న్ గెలిచిన త‌ర్వాత కూడా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్కరు కూడా వ‌చ్చి త‌మ నాయ‌కుడికి అభినంద‌న‌లు తెలియ‌జేయ‌లేద‌ని, అంటే ఆయ‌న గెలిచినా కూడా ఎవ‌రికీ ప‌ట్ట‌దా? గతంలో అని పృథ్వీ ప్రశ్నించారు. 151 సీట్లు గెలిపించిన నాయకుడికి సినీ ఇండస్ట్రీ వాళ్ళు క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌డం లేదని పృథ్వీ అన్నాడు.

    సినిమా వాళ్లకు ఓట్లేయొద్దు

    సినిమా వాళ్లకు ఓట్లేయొద్దు

    ఏపీ సీఎంను అభినందించడానికి సినీ పెద్దలెవరూ రాకపోవడంపై ఫైర్ అయిన పృథ్వీ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు సినిమా వాళ్లకు ఓట్లు వేయద్దని పిలుపునిచ్చాడు. అమరావతి గడ్డపై ఇంకో 30 ఏళ్లు వైసీపీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో పృథ్వీ కామెంట్స్ టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

    పృథ్వీపై విమర్శలు

    పృథ్వీపై విమర్శలు

    పృథ్వీ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై చాలా మంది సినీ, రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. ‘నీ స్వ‌లాభం కోసం ఇండ‌స్ట్రీని ఎందుకు మ‌ధ్య‌లోకి తీసుకొస్తున్నావ్' అంటూ కొందరు సినీ ప్రముఖులు ఆయనతో అన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ముఖ్య‌మంత్రి దృష్టిలో ప‌డి ఏదో ఓ ప‌ద‌వి తీసుకోడానికే ఇలా పృథ్వీ నానా మాట‌లు మాట్లాడుతున్నాడంటూ కొంద‌రు ఈయ‌న‌పై బాహాటంగానే దుమ్మెత్తిపోశారు.

     తిరుమలలో పృథ్వికి రాజేంద్రప్రసాద్ కౌంటర్

    తిరుమలలో పృథ్వికి రాజేంద్రప్రసాద్ కౌంటర్

    తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాజేంద్రప్రసాద్ పృథ్వీ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎంను వెంటనే కలవడానికి సినీ నటులేం వ్యాపారవేత్తలు కాదని అన్నాడు. సినిమా వాళ్ళు సీఎంను కలిసి అభినందించాలనే నిబంధన ఏమీ లేదని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

     కలుద్దామనుకున్నా.. కానీ ఆయనే

    కలుద్దామనుకున్నా.. కానీ ఆయనే

    రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపిన రాజేంద్రప్రసాద్.. ప్రజలకు తాగునీరందించే సీఎం దేవుడి లాంటి వాడని అన్నారు. సీఎం జగన్‌ను రేపు కలవాల్సి ఉందని కానీ ఆయనే కొన్ని కారణాల వల్ల మరో రెండుమూడు రోజుల్లో కలవమన్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

    English summary
    Tollywood senior actor, Ysr congress party leader Prudhvi Raj sensational comments on Film makers. They not ready for wish to Andhraprdesh Chief Minister YS Jaganmohan Reddy he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X