‘డ్రీమ్’ రోల్‌తో పిచ్చెక్కిస్తున్న రాజేంద్రప్రసాద్

డ్రీమ్ సినిమా మూడో షెడ్యూల్ అక్టోబర్ రెండో వారం నుంచి వైజాగ్ లో ప్రారంభం అయింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నాలుగు వెరైటీ గెటప్స్ లో కనిపించనున్నాడు. ప్రతి గెటప్ కూ ఓ ప్రత్యేకత ఉంటుందని సినిమా యూనిట్ సభ్యుల సమాచారం. రాజేంద్రప్రసాద్ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా అతన్ని చూపించబోతెన్నాడు దర్శకుడు భవానీ శంకర్. ఈ సినిమా గురించి భవానీ శంకర్ మాట్లాడుతూ...తెలుగులో నిర్మిస్తున్న మొట్ట మొదటి కల్ట్ థ్రిల్లర్ సినిమా ఇది, సాంకేతికంగా యూనివర్శల్ స్థాయికి తగ్గకుండా చిత్రీకరణ సాగుతోంది తెలిపారు. నవంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











