twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది: రాజేంద్రప్రసాద్ ఎమోషనల్

    |

    "ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కులను ఎంతగానో మెప్పించిన న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం 'బేవ‌ర్స్‌'. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ క్రియెష‌న్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్ అర‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. సునీల్ కశ్య‌ప్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ తన కూతురు చేసిన పని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

    నా కూతురు ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది

    నా కూతురు ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది

    ఒక తల్లిలేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు. నా పదవ ఏట మా అమ్మ చనిపోయింది. నాకు ఒకే ఒక కూతురు... పేరు గాయిత్రి. ఆమెతో నేను మాట్లాడను. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది. ఇవన్నీ మామూలు విషయాలే. ‘బేవార్స్' సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన పాట విన్న తర్వాత నా కూతురును ఇంటికి పిలిచించి ఆ పాట వినిపించాలనిపించింది... అని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

    నాలుగు సార్లు నా కూతురుకు వినిపించాను

    నాలుగు సార్లు నా కూతురుకు వినిపించాను

    ఈ సినిమాలోని ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లీ... నా ప్రాణాలే పోయాయమ్మా' అని సుద్దాల అశోక్ తేజ రాసిన పాట నా మనసుకు ఎంతగానో నచ్చింది. ఆ పాటను ఇంటికి తీసుకెళ్లి నా కూతురు గాయిత్రిని పిలిపించి... ఎదురుగా కూర్చోబెట్టి నా మనస్పూర్తిగా ఆమెకు నాలుగు సార్లు వినిపించిన వాడిని నేను. అమ్మ పోయినపుడు కూడా నేను ఏడవలేదు. కానీ కూతురు వెళ్లిపోయినపుడు ఏడ్చాను... అని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

    మీకు నిజంగా మనసు ఉంటే..

    మీకు నిజంగా మనసు ఉంటే..

    మీరు నిజంగా మనసు ఉంటే ఈ పాటను జన్మలో మరిచిపోలేరు. సుద్దాల అశోక్ తేజ నాకంటే చిన్నవాడు... లేదంటే ఆయన పాదాలకు నమస్కారాలు పెట్టేవాడిని. అంత అద్భుతంగా ఈ పాటను రాశాడు. కొన్ని మరిచిపోలేని సినిమాలు మనం చేసినపుడు, కొన్ని మరిచిపోలేని ఇన్సిడెంట్స్ మనం గుర్తు చేసుకోవాలి.... అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

    బేవార్స్

    బేవార్స్

    ‘బేవర్స్' ఈ టైటిల్ ఏంటి అని చాలా మంది అనుకుంటున్నారు. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు... పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారు... అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. అక్టోబర్ 12న సినిమా విడుదల కాబోతోంది అన్నారు.

    English summary
    Rajendra Prasad Emotional speech About His Daughter Love marriage at Bewars movie music launch. The movie directed by Ramesh Cheppala, Releasing on October 12, 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X