ఆగడు: రాజేంద్రప్రసాద్ పాత్రను చంపేసారు?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో రాజేంద్రప్రసాద్‌ను విలన్ సోనూసూద్ చంపేస్తారని, ఆ తర్వాత క్లైమాక్స్‌లో మహేష్ బాబు సోనుసూద్‌ను చంపేస్తాడని తెలుస్తోంది.
ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఆగడు టైటిల్ సాంగ్, నారి నారి, జంక్షన్లో..., తూ ఆజా సరోజా పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం థమన్ చేసిన ఆడియోల్లో ‘ఆగడు' ది బెస్ట్ ఆడియోగా అందరి ప్రశంసలు అందుకుంటోందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. సేల్స్ పరంగా ఈ ఆడియో కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్ని ఏరియాల నుండి రిపోర్ట్ష్ వస్తున్నాయి. అలాగే డిజిటల్ కూడా చాలా హై రేంజిలో డౌన్ లోడ్స్ జరుగుతున్నాయని తెలిపారు. లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











