twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రాయల్‌ రీల్‌' అవార్డు అందుకున్న రాజేంద్రప్రసాద్

    By Srikanya
    |

    వాషింగ్టన్‌ : 'డ్రీమ్‌' చిత్రంలో నటనకుగానూ సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ కి ప్రతిష్టాత్మకమైన రాయల్‌ రీల్‌ పురస్కారం లభించింది. కెనడా చిత్రోత్సవాల్లో ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ' కెనడా ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ఆయన నటించిన ''డ్రీం'' చిత్రానికి 'రాయల్‌ రీల్‌' అవార్డును అందుకునేందుకు రాజేంద్రప్రసాద్‌ కెనడా విచ్చేయటం అక్కడ తెలుగు వారందరనీ ఆనందపరిచింది.

    దాదాపు 50 దేశాల నుంచి 1000కి పైగా చిత్రాలు పాల్గొన్న ఈ పోటీలో రాజేంద్రప్రసాద్‌కు ఈ అవార్డు దక్కడం అటు తెలుగు సినీ పరిశ్రమకు, ఇటు ప్రవాసాంధ్రులందరికీ గర్వకారణమని 'తాకా' కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు భవానీశంకర్‌, ఆర్థిక నిపుణుడు సుకుమార్‌లను సన్మానించనున్నారు. ఇక తెలుగు అలయన్సెస్‌ ఆఫ్‌ కెనడా (తాకా) సంఘం ఆధ్వర్యంలో టోరంటోలోని పాయల్‌ బ్యాంక్వెట్‌ హాలులో ''హాస్య కిరీటి'' బిరుదుతో ఆదివారం సాయంత్రం సన్మానించింది.

    రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...''మనస్తత్వ అంశాల నేపథ్యంలో సాగే కథ 'డ్రీమ్‌'. అందులో కలకీ, వాస్తవానికీ తేడా తెలియని ఓ రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌గా నటించాను. ఆ పాత్ర నటుడిగా నాకు ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. ఎంతో ఇష్టపడి చేసిన ఆ పాత్రకు పురస్కారం రావడం ఆనందంగా ఉంది. నా సినీ జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకొన్నాను. ప్రతిష్టాత్మకమైన రాయల్‌ రీల్‌ అందుకోవడం మరిచిపోలేని అనుభవం'' అన్నారు.

    అలాగే ''నవ్వుని నమ్ముకొని ప్రయాణం మొదలుపెట్టాను. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ ప్రేక్షకులకి వినోదం పంచాను. ఆ పాత్రలే నన్ను నటుడిగా తీర్చిదిద్దాయి. అవే నాకు గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతున్నాయి''అన్నారు . అనంతరం ఆయన వ్యాంకోవర్‌లో జరిగిన అవార్డుల వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. బాలీవుడ్‌ ప్రముఖులు షారుఖ్‌ఖాన్‌, అనురాగ్‌ బసు, ప్రభుదేవా తదితరులతో ముచ్చటించారు.

    ఇక ఉగాదిని పురస్కరించుకుని నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను 'విశ్వ విశిష్ఠ నటప్రవీణ' బిరుదుతో సత్కరించనున్నట్లు టీఎస్‌ఆర్‌ లలిత కళాపరిషత్‌ వ్యవస్థాపకులు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఈనెల 11న విశాఖలోని రామకృష్ణా బీచ్‌లో జరిగే ఉగాది వేడుకల్లో రాజేంద్రప్రసాద్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2011-12 సంవత్సరానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులకు ఈనెల 20జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

    English summary
    Nata Kireeti Dr Rejendra Prasad received Royal Reel Award at world film festival,Vancouvor, canada for his Dream movie today i.e., 6th April . He is the first person from India to receive this award.The following prominent people attended the event. He was the special Guest for Times of India Film Awards.The following persons witnessed the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X