అయ్యారే సినిమాలో రాజేంద్రప్రసాద్ స్వామీజీగా మారి చాలా రోమాంటిక్ గా
డా.రాజేంద్రప్రసాద్ కాషాయాన్నీ, కమండలాన్నీ ధరించి... స్వామీజీగా మారిపోయారు. వేదాంత తత్వాలను భక్తులకు బోధిస్తూ... జీవితాన్ని సాగిస్తున్నారు. యువ భక్తురాళ్లకు ప్రత్యేక బోధనలు చేస్తూ... ఏకాంత సేవతో వాళ్లను పునీతుల్ని చేస్తున్నారు. 'అయ్యారే" సినిమాలో ఆయన స్వామీజీగా చేసే లీల ఇది. ఇందులో శివాజీ కూడా ఓ హీరో. ఆయన పాత్ర రొమాంటిక్‌గానూ, ఎంటర్‌టైనింగ్‌గానూ ఉంటుందట.
సాగర్‌చంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ... డా.బి.సుధాకర్‌బాబు, రంగన అచ్చప్ప కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ''ఈ చిత్ర కథాకథనాలు వినూత్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. స్వామీజీగా రాజేంద్రప్రసాద్ అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. ఆ గెటప్‌లో తెరమీద ఆయనను చూడగానే ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వులు విరబూయడం ఖాయం.
ఆ ఆశ్రమం ఎపిసోడ్ ఆద్యంతం తమాషాగా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది"" అని తెలిపారు. ''సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది"" అని చెప్పారు. సాయికుమార్, అనీషా సింగ్, డా. శివప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, అలీ, హర్షవర్థన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: నివాస్, కెమెరా: భాస్కర్ సామల, ఆర్ట్: పార్థసారధి వర్మ, ఎడిటింగ్: ప్రవీణ్ పి.కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిక్షపతి తుమ్మల.


Click it and Unblock the Notifications











