twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజేంద్ర ప్రసాద్ శపథం.. అదే జరిగితే ఇక మీ ముందుకు రానంటూ!

    |

    నటుడు రాజేంద్ర ప్రసాద్ పూర్తి స్థాయిలో అలరించే పాత్రతో వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఏమీ లేవు. ఆయన పూర్తిస్థాయిలో నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2 అనే సినిమాకు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ఆయన ఈ సినిమా కనుక ఆడకపోతే తాను మళ్లీ సినిమాల్లో కనిపించని అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    ప్రీ రిలీజ్

    ప్రీ రిలీజ్

    విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన తాజాగా చిత్రం 'ఎఫ్3'. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది.

    ఎఫ్3లో కూడా కీలక పాత్ర

    ఎఫ్3లో కూడా కీలక పాత్ర

    ఇక ఈ వేదికపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్2 సినిమాలో కీ రోల్ ప్లే చేసిన నటుడు రాజేంద్రప్రసాద్.. ఎఫ్3లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజానికి ఎఫ్3 మూవీ ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ప్రతి మనిషికి నవ్వు అవసరం అని.. ఆ నవ్వులు పంచే సినిమా ఎఫ్3 అని ఆయన చెప్పుకొచ్చారు.

    మీ ముందు నిలబడను

    అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయని.. వాటి అన్నింటికి పరిష్కారం నవ్వు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను 40 ఏళ్లుగా నవ్వును నమ్ముకుని ఉన్నానని చెప్పారు. అంతే కాక ఈ ఎఫ్3ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తీశారని రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ ఒక శపథం చేశారు. ఈ సినిమా హిట్ కాకపోతే.. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. మళ్లీ మీ ముందు నేను ఎప్పుడు నిలబడనని అన్నారు..

    ఆయన తర్వాత దిల్ రాజు

    ఆయన తర్వాత దిల్ రాజు

    మనిషికి ఏం అవసరమో అదేవిధంగా సినిమా తీశారని, ఈ సినిమాలో అన్ని పాత్రలు 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తాయని ఆయన అన్నాడు. ఎఫ్3 సినిమా ప్రతి ఒక్కరు చూసి.. సూపర్ హిట్ చేయాలని కోరారు. ఇక ఒకప్పుడు తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు.. వారి తరువాత మనస్ఫూర్తిగా నేను మూవీ మొఘల్ అని పిలవగలిగేది నా సోదరుడు దిల్ రాజునే అని అన్నాడు.

    అత్యవసరమైన సినిమా

    అత్యవసరమైన సినిమా

    ఈ సినిమా నిర్మాత శిరీష్ ఒక మంచి మనిషి.. నాకు నిండుగా నచ్చినటువంటి మనిషని అన్నారు. ఈ రోజు మనం ఉన్న పరిస్థితికి 100% అవసరమైన సినిమా ఎఫ్3 అని, సమాజంలో బయట టెంపరేచర్ వేడి, సమస్యల వేడితో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చాలా అత్యవసరమైనటువంటి నవ్వులను పంచే సినిమా ఇది అని అన్నారు. మొత్తం మీద ఆయన చేసిన ఆసక్తి కరమైన శపథం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Rajendra prasad made interesting comments at F3 cinema pre release event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X