"సినిమా చూడండి..చీర పట్టుకెళ్ళండి"..కొత్త స్కీమ్
తమ చిత్రాన్ని తిలకించిన మహిళలకు రాష్ట్రంలోని కొన్ని ముఖ్య కేంద్రాలలోని సినిమా థియేటర్ల వద్ద చీరలను ఉచితంగా అందిచనున్నట్లు 'గుడు గుడు గుంజం' నిర్మాత రవికుమార్ రెడ్డి చెప్తున్నారు. శ్రావణమాసం సందర్భంగా స్త్రీలకు ఈ కానుకని ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సినిమా టికెట్ కొన్న ప్రతి స్త్రీకి ఓ చీర బహుమతిగా ఇస్తామని చెప్పారు. మహిళలకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని, వారిని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకడు వీరూ.కె తెలిపారు. డా.రాజేంద్రప్రసాద్, కస్తూరి, పార్థు, రితిమ, చాహత్ ముఖ్యతారలుగా వీరూ.కె దర్శకత్వంలో రూపొందిన 'గుడు గుడు గుంజం' సినిమా ఈ రోజు (శుక్రవారం) విడుదలవుతోంది. మొత్తానికి ప్రేక్షకులనుధియోటర్స్ కు రప్పించటానికి ఇలా రకరకాల స్కీమ్ లు వెయ్యాల్సిన స్దితి తెలుగు పరిశ్రమకు వచ్చింది. ఇక ఇది మహిళలకు నచ్చే చిత్రం కాబట్టి చీరలు ఇస్తున్నారు..మరి మగాళ్ళకు నచ్చే చిత్రం తీస్తే..ఏమిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











