రాజేంద్రప్రసాద్, సుహాసిని కాంబినేషన్లో...
రాజేంద్రప్రసాద్, సుహాసిని జంటగా దినేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఇన్ కంటాక్స్ ఆఫీసర్ గా రాజేంద్రప్రసాద్, బ్యాంక్ ఉద్యోగినిగా సుహాసిని నటిస్తున్నారు. వినోదభరిత కుటుంబకథాచిత్రమిది. ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, కావేరి ఝా, రఘుబాబు, సూర్యతేజ్, హర్షవర్ధన్, ఝాన్సీ, రజిత, శిల్ప, సందీప్తి, ఉషశ్రీ, రమ్యశ్రీ, కళ్యాణి తదితరులు నటిస్తున్నారు.దర్శకుడు దినేష్ బాబు...తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 32 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. ఇంకా పేరు ఇంకా నిర్ణయించని ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్, పాటలు, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, ఎడిటింగ్: మురళి-రామయ్య, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్, ప్రొడక్షన్ డిజైనర్: వేమూరి సత్యనారాయణ, కథ, ఫొటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దినేష్ బాబు.


Click it and Unblock the Notifications











