రాజేంద్రప్రసాద్... పైకిరాడు రానివ్వడా?
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ సరికొత్త గెటప్‌తో ఈ చిత్రంలో కనిపిస్తాడని, ఆయన పాత్రే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, పూర్తి కమర్షియల్ విలువలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిత్రం రూపొందుతుందని తెలిపారు. మిగిలిన షూటింగ్‌ను చివరి షెడ్యూల్‌లో ఈ నెలలోనే చిత్రీకరిస్తామని తెలిపారు.
భరత్‌భూషణ్, రామ్‌తేజ్, విజయ్, మనోజ్ నందం, పరీసింగ్, దీక్షాపంత్, రాధాకుట్టి, తాగుబోతు రమేష్, అల్లరి సుభాషిణి, మేల్కొటె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్‌రెడ్డి, ఎడిటింగ్: రామ్స్, నిర్మాతలు: వినయ్, పూనాటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంటి జ్ఞానమణి.
రాజేంద్ర ప్రసాద్ నటించిన 'ఓనమాలు' చిత్రం ఇటీవల విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గతంలో ఆయన నటించిన ఆనలుగురు, మీశ్రేయోభిలాషి లాంటి మంచి చిత్రాల సరసన ఓ మంచి జ్ఞాపకం లాంటి సినిమాగా 'ఓమమాలు' చిత్రం చోటు సంపాదించుకుంది.


Click it and Unblock the Notifications












