twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్....తండ్రిగా నటించేది కూడా అతనే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో నాగార్జున వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అకిల్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో పాటు పలువురు హీరోలకు తండ్రి పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ అఖిల్ సినిమాకు కూడా అలాంటి పాత్రనే పోషించడం విశేషం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అఖిల్ తెరంగ్రేటం విషయంలో నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఎంపిక దగ్గర నుండి అన్ని విషయాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అఖిల్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఇటీవల శిల్ప కళా వేదికలో భారీగా వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ అక్కినేని అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

    Rajendra Prasad play Akhil’s dad role

    ఈ సినిమాలో సాయేషా సైగల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ దిలీప్ కుమార్, అతని భార్య సైరా భానులకు రిలేటివ్ అయిన సాయేషా సైగల్ అఖిల్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేయచోతోంది.

    ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ విషయమై నితిన్ స్పందిస్తూ....‘ప్రొడక్షన్ ఎ' లాంచ్ చేసాము. నిర్మాతగా ఇదే నా తొలి సినిమా. అఖిల్ నటిస్తున్న తొలి చిత్రం. మీ అందరి సపోర్టు కావాలి' అని కోరారు.

    ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వినాయక్ పోకడ చూస్తుంటే అఖిల్‌ను పూర్తి మాస్ హీరోగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అందుకే తొలి చిత్రం ప్రయోగాల జోలికి పోకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు.

    వినాయక్ శైలి యాక్షన్, వినోదం మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుంది. షూటింగ్ త్వరత గతిన పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.

    English summary
    Akhil’s debut is one of the most awaited in the Telugu Film Industry. veteran actor Rajendra Prasad will be playing the role of Akhil’s dad in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X