రవితేజకు నిప్పు పెడుతున్న రాజేంద్రప్రసాద్
కామిడీలతో దూసుకుపోతున్న రవితేజతో త్వరలో మరో సీనియర్ కామిడీ హీరో రాజేంద్రప్రసాద్ జతకట్టనున్నారు. రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వైవీఎస్‌చౌదరి నిర్మిస్తోన్న నిప్పు చిత్రంలో నవ్వుల రాజేంద్రుడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆ నలుగురు చిత్రంలోని ఆయన పాత్రలో ఉండే హుందాతనం ఈ పాత్రలో కూడా ఉంటుందని, గుణశేఖర్ ఆ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారని, ఈ పాత్ర సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలవనుందని నిర్మాత వైవీఎస్ చౌదరి చెప్పారు. అలాగే కామెడీకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్. పరాయి దేశంలో ఉన్న తెలుగువాళ్లు సైతం ఆయన డీవీడీలను ప్రత్యేకంగా దాచుకుంటారంటే ఆయన ఖ్యాతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆయన హీరోగా మాత్రమే కాక, భిన్నమైన పాత్రలను కూడా చేయాలని నిర్ణయించుకోవడం అటు దర్శకులు, ఇటు కథారచయితలే కాదు ప్రేక్షకులు కూడా ఆనందించాల్సిన విషయం. మేం అడగ్గానే పాత్ర ఔన్నత్యం తెలుసుకొని బిజీగా ఉన్నా ఎడ్జస్ట్ చేసి మరీ మాకు డేట్స్ ఇచ్చారాయన. ఇక నిప్పు అనే పేరుకు తగ్గట్టుగా ఇందులో రవితేజ పాత్ర చిత్రణ సాగుతుంది. రవితేజ సినిమాల్లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్, గుణశేఖర్ సినిమాల్లో ఉండే కథాబలం, సాంకేతిక విలువలు ఈ సినిమాలో ఉంటాయి. ముందుగా చెప్పినట్టుగానే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తాం అని వైవీఎస్ చౌదరి తెలిపారు.


Click it and Unblock the Notifications











