నవ్వించే స్వామీజి (అయ్యారే ప్రివ్యూ)
సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతూ స్వామి నిత్యానంద వీడియోకు చిక్కిన ఇతివృత్తం ఆధారంగా నిర్మించారంటూ ప్రచారం జరిగిన
అయ్యారే సినిమాను ఈ రోజు జరుగుతోంది. కోర్టులోనూ,సెన్సార్ వద్ద ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రం వినోదం ప్రధానంగా సాగుతుంది. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో స్వామి నిత్యానంద పాత్రను పోషించారు. ఈ సినిమా తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని అంటూ ఆ సినిమా విడుదలను అనుమతించవద్దని అప్పట్లో స్వామి నిత్యానంద కోర్టును కోరారు. అయితే వాటినన్నటినీ దాటుకుని ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.
ఈ చిత్రంలో ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) ఏటీఎమ్ కేంద్రానికి కాపలాదారుడు. అనుకోని పరిస్థితుల్లో స్వామీజీ అవతారమెత్తుతాడు. వెంకటేశం (శివాజీ) స్కూటర్ మెకానిక్. ప్రసాద్ చేసే పనుల ప్రభావం వెంకటేశంపై పడుతుంది. ఈ ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. అప్పుడేమైంది? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...కథ, కథనాలు ఈ సినిమాకి ప్రధాన బలం. వినోదంతోపాటు హృదయాన్ని హత్తుకొనే భావోద్వేగాలున్నాయి. ఓ సెక్యూరిటీ గార్డు స్వామీజీగా ఎందుకు మారాల్సి వచ్చిందన్నది సస్పెన్స్ అన్నారు.
స్వామీజీగా రాజేంద్రప్రసాద్ అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. ఆ గెటప్‌లో తెరమీద ఆయనను చూడగానే ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వులు విరబూయడం ఖాయం. ఆ ఆశ్రమం ఎపిసోడ్ ఆద్యంతం తమాషాగా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది అని తెలిపారు. సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు.
సంస్థ: ప్రీతమ్ ప్రొడక్షన్స్
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శివాజీ, సాయికుమార్, అనీషాసింగ్, డా||శివప్రసాద్, అలీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు.
ఎడిటింగ్: ప్రవీణ్ పి.కుమార్
మాటలు: నివాస్
కెమెరా: భాస్కర్ సామల
ఆర్ట్: పార్థసారధి వర్మ
నిర్మాతలు: బి.సుధాకర్‌బాబు,రంగన అచ్చప్ప
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిక్షపతి తుమ్మల
దర్శకత్వం: సాగర్‌చంద్ర.
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











