twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వించే స్వామీజి (అయ్యారే ప్రివ్యూ)

    By Srikanya
    |

    సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతూ స్వామి నిత్యానంద వీడియోకు చిక్కిన ఇతివృత్తం ఆధారంగా నిర్మించారంటూ ప్రచారం జరిగిన
    అయ్యారే సినిమాను ఈ రోజు జరుగుతోంది. కోర్టులోనూ,సెన్సార్ వద్ద ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రం వినోదం ప్రధానంగా సాగుతుంది. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో స్వామి నిత్యానంద పాత్రను పోషించారు. ఈ సినిమా తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని అంటూ ఆ సినిమా విడుదలను అనుమతించవద్దని అప్పట్లో స్వామి నిత్యానంద కోర్టును కోరారు. అయితే వాటినన్నటినీ దాటుకుని ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.

    ఈ చిత్రంలో ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌) ఏటీఎమ్‌ కేంద్రానికి కాపలాదారుడు. అనుకోని పరిస్థితుల్లో స్వామీజీ అవతారమెత్తుతాడు. వెంకటేశం (శివాజీ) స్కూటర్‌ మెకానిక్‌. ప్రసాద్‌ చేసే పనుల ప్రభావం వెంకటేశంపై పడుతుంది. ఈ ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. అప్పుడేమైంది? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందో తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...కథ, కథనాలు ఈ సినిమాకి ప్రధాన బలం. వినోదంతోపాటు హృదయాన్ని హత్తుకొనే భావోద్వేగాలున్నాయి. ఓ సెక్యూరిటీ గార్డు స్వామీజీగా ఎందుకు మారాల్సి వచ్చిందన్నది సస్పెన్స్ అన్నారు.

    స్వామీజీగా రాజేంద్రప్రసాద్ అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. ఆ గెటప్‌లో తెరమీద ఆయనను చూడగానే ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వులు విరబూయడం ఖాయం. ఆ ఆశ్రమం ఎపిసోడ్ ఆద్యంతం తమాషాగా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది అని తెలిపారు. సునీల్ కాశ్యప్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ఇందులో మొత్తం 5 పాటలుంటాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు.

    సంస్థ: ప్రీతమ్‌ ప్రొడక్షన్స్‌
    నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, శివాజీ, సాయికుమార్‌, అనీషాసింగ్‌, డా||శివప్రసాద్‌, అలీ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు.
    ఎడిటింగ్: ప్రవీణ్ పి.కుమార్
    మాటలు: నివాస్
    కెమెరా: భాస్కర్ సామల
    ఆర్ట్: పార్థసారధి వర్మ
    నిర్మాతలు: బి.సుధాకర్‌బాబు,రంగన అచ్చప్ప
    ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిక్షపతి తుమ్మల
    దర్శకత్వం: సాగర్‌చంద్ర.
    విడుదల: శుక్రవారం.

    English summary
    Rajendra Prasad's comedy film Ayyare is releasing today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X