‘మొగుడు’లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమిటి
కృష్ణవంశీ 'మొగుడు" చిత్రంలో రాజేంద్రప్రసాద్ గోపిచంద్ కు తండ్రి గా చేస్తున్నారు. ఆయన తన పాత్రను గురించి చెపుతూ...ఆకలిగొన్న తరుణంలో 'మొగుడు"లో నేను వెతికిన పాత్ర లభించింది. ఆంజనేయప్రసాద్- ఉదాత్త భావాలు న్న మనిషి. ఆశావాహదృక్పథంతో జీవిస్తూ...మరచిపోతున్న మానవసంబంధాల్ని తోటివారికి అనుక్షణం గుర్తు చేస్తుంటాడు. ఇంటి పెద్దగా..కుటుంబ బాధ్యతలలో ఎలా మెలగాలో చెబుతాడు. ఎన్టీఆర్, ఎస్వీఆర్,..పాత్రలు ఆనాటి తెరపై ఎలా ఉండేవో గుర్తు చేసుకోండి. ఇకముందు ఆ స్థాయి గొప్ప పాత్రలు చేయాలని ఉంది""అన్నారు. అలాగే ఆకలితో ఉన్నోడికి.. షడ్రసోపేతమైన భోజనం దొరికితే ఎలా ఉంటుందో..అలాంటి అనుభూతిని అనుభవిస్తున్నా ఇప్పుడు. ఓ పరిణతి ఉన్న నటుడిగా..ఇంకా ఏదైనా కొత్తగా చేయాలని..తపిస్తున్న సమయంలో అరుదైన పాత్ర దక్కింది. మా ఊళ్లో ఇలాంటి వాడు ఒక్కడున్నా చాలు..అని మీరంతా అనుకునే పాత్ర అది"" అన్నారు రాజేంద్రప్రసాద్. ఇక నుంచి పరిణతి ఉన్న నటుడి సేవలు పరిశ్రమకు ఎంత అ వస రమో.. తనలోని నటుడిని కొత్త పంథాలో చూపించే కథలు, దర్శకులు అంతే అవసరం. 'ఆ నలుగురు"లో రఘురామయ్య పాత్ర చేశాక చాలాకాలం సందిగ్ధ స్థితిలోనే ఉన్నా అన్నారాయన.


Click it and Unblock the Notifications











